ఆంధ్రాకు స్పెష‌ల్ స్టేట‌స్‌… ‘మా’కు బిల్డింగ్!

‘స్పెష‌ల్ స్టేట‌స్ తీసుకొస్తా’ అనేదే గ‌త ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌లో పార్టీల ప్ర‌ధాన నినాద‌మైంది. అది వ‌చ్చింది లేదు.. ఏడ్చిందీ లేదు. దాని గురించే అంతా మ‌ర్చిపోయారు. ఇప్పుడు `మా` ఎన్నిక‌ల వ్య‌వ‌హారం కూడా అలానే సాగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కి సొంతంగా బిల్డింగ్ అంటూ లేదు. `మా` ఏర్ప‌డి ద‌శాబ్దాలైపోయినా, సొంత భ‌వ‌నం స‌మ‌కూర్చుకోలేక‌పోయారంతా. చిరంజీవి, మోహ‌న్ బాబు, ముర‌ళీ మోహ‌న్, నాగ‌బాబు, నాగార్జున లాంటి హేమాహేమీలంతా `మా` అధ్య‌క్షులుగా ప‌నిచేశారు. అంద‌రూ చెప్పేదొక్క‌టే..`మా`కు బిల్డింగ్ కావాలి అని. కానీ అది సాధించలేక‌పోయారు.

గ‌త ఎన్నిక‌ల‌లోనూ.. అంతా చెప్పింది ఇదే. `మా`కు సొంత భ‌వ‌నం తీసుకొస్తామ‌ని గ‌ట్టిగా వాగ్దానాలు చేశారు. ఇప్పుడూ అదే తంతు. ఈ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌బోతున్న ప్ర‌కాష్ రాజ్ కూడా ఇదే పాత వాగ్దానాన్ని ప‌ట్టుకుని `మా` స‌భ్యుల మ‌న‌సుల్ని గెలుద్దాం అనుకుంటున్నాడు. ఆయ‌న సొంత భ‌వ‌నాన్ని… ఫైవ్ స్టార్ సౌక‌ర్యాల‌తో ఏర్పాటు చేయిస్తానంటున్నాడు. అంటే జిమ్‌, స్విమ్మింగ్ పూల్, ఆట‌స్థ‌లం, ఫంక్ష‌న్ హాల్.. ఇలాంటి సౌక‌ర్యాల‌తో అన్న‌మాట‌. మంచు విష్ణు, జీవిత‌లు సైతం ఇదే వాగ్దానాన్ని ప‌ట్టుకుని ఈ ఎన్నిక‌ల‌లో గెలుద్దాం అని ఫిక్స‌యిన‌ట్టు అనిపిస్తోంది. ద‌శాబ్దాలుగా తీర‌ని క‌ల‌.. ఈసారి తీరుతుంద‌న్న న‌మ్మ‌కం `మా` స‌భ్యుల‌కు ఎప్పుడో పోయింది. మ‌రి ఇప్పుడు ఈ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి వాగ్దానాల‌కు వాళ్లు మ‌ళ్లీ ప‌డిపోతారా?

అంత స్థాయి మ‌న‌కు లేదా?

`మా`కి బిల్డింగ్ లేక‌పోవ‌డం అన్న‌ది… నిజంగా టాలీవుడ్ కి సిగ్గు చేటే. దేశంలోనే.. అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న న‌టులు `మా`లో ఉన్నారు. వంద‌ల కోట్ల సినిమాలు టాలీవుడ్ లో త‌యార‌వుతున్నాయి. వాళ్లెవ‌రూ… `మా`ని సొంత సంస్థ‌గా భావించ‌డం లేదా? చిరు, నాగార్జున‌, మోహ‌న్ బాబు, మ‌హేష్, ప‌వ‌న్‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌, బ‌న్నీ… ఇలాంటివాళ్లంతా పూనుకుంటే `మా` భ‌వ‌నం ఎంత సేపు? `మా` బిల్డింగ్ కోసం స్థ‌లం సంపాదించాల‌ని.. ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌భుత్వం కూడా సానుకూలంగానే ఉంది. కానీ అనువైన చోటే స్థ‌లం కావాల‌న్న‌ది `మా` ప‌ట్టు. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబ‌ర్ కి ద‌గ్గ‌ర్లోనే.. `మా` బిల్డింగ్ ఉంటే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌నుకుంటున్నారు. ఫిల్మ్‌న‌గ‌ర్ లో స్థ‌లాల రేట్లు ఆకాశాన్ని దాటాయి. `మా`కు అవ‌స‌ర‌మైన స్థ‌లం ఇవ్వాలంటే వంద‌ల కోట్ల పైమాటే. అందుకే ప్ర‌భుత్వం ఓ ప‌ట్టాన ఈ స‌మ‌స్య‌ని తీర్చ‌లేక‌పోతోంది. `ప్ర‌భుత్వం స్థ‌లం ఇస్తే.. అప్పుడు భ‌వ‌నం క‌ట్టుకుందాం` అని మా స‌భ్యులు ఉన్నారు. కాబ‌ట్టి… ఈ స‌మ‌స్య అలానే ఉండిపోతోంది. `మా` అధ్య‌క్షుడిగా గెలిచిన వాళ్లంతా కొత్త‌లో `మా` భ‌వ‌నం కోసం ప్ర‌య‌త్నించిన వాళ్లే. కానీ కొంత‌కాలం ప్ర‌య‌త్నించి.. విసిగిపోయి, త‌మ ప్ర‌య‌త్నాల్ని ఆపేశారు. అధ్య‌క్షులు మారుతున్నారు గానీ, `మా` స‌మ‌స్య మాత్రం తీర‌డం లేదు. ఇన్నేళ్ల‌యినా అదే పాత వాగ్దానం ప‌ట్టుకుని వేలాడుతున్నారు. మ‌రి ఈసారి `మా` ఓట‌ర్లు.. ఈ వాగ్దానానికి మ‌ళ్లీ ప‌డిపోతారా? అన్న‌ది తేలాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close