ముమైత్‌కున్న ధైర్యం ర‌వితేజ‌కు లేదా?

డ్ర‌గ్స్ కేసులో దాదాపుగా స్టార్స్ విచార‌ణ పూర్త‌య్యింది. సిట్ ముందు ఒక్కొక్క‌రూ ఒక్కోలా ప్ర‌వ‌ర్తించారు. ‘మేం డ్ర‌గ్స్ తీసుకొన్నాం’ అంటూ ఎవ్వ‌రూ ఒప్పుకోలేదు.. ఒక్క ముమైత్ ఖాన్ త‌ప్ప‌. తెర‌పై దుందుడుకుడు హీరోయిజం చూపించే ర‌వితేజ సైతం శాంపిల్స్ ఇవ్వ‌డానికి భ‌య‌ప‌డితే.. ముమైత్ మాత్రం ‘కావ‌ల్సినంత తీసుకోండి’ అంటూ స‌రెండ‌ర్ అయిపోయింది. ముమైత్ తెగువ చూసి ముచ్చ‌ట ప‌డ్డారో, లేదంటే… తాను డ్ర‌గ్స్ తీసుకోదులే.. అని నమ్మ‌కం వ‌చ్చేసిందో.. సిట్ అధికారులు `అఖ‌ర్లెద్దు` అని పంపించేశారు. ముమైత్ కి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు సిట్ అధికారుల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఇప్పటి వ‌ర‌కూ సిట్ విచార‌ణ ఎదుర్కొన్నవారిలో ముమైత్ మాత్ర‌మే ధైర్యంగా స‌మాధానాలు చెప్పింద‌ట‌.

ఒక‌ప్పుడు తాను డ్ర‌గ్స్ తీసుకొన్న విష‌యాన్ని నిర్భ‌యంగా ఒప్పుకొన్న ముమైత్‌, ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లుగా డ్ర‌గ్స్ తీసుకోవ‌డం లేద‌ని, దానికి దూరంగా ఉంటున్నాన‌ని బ‌హిర్గంతం చేసింద‌ట‌. సిట్ ప‌రిశీల‌న‌లోనూ ముమైత్ చెప్పింది నిజం అని తేల‌డంతో.. ర‌క్త న‌మూనాల‌ని సేక‌రించే అవ‌కాశం ఉన్నా.. సిట్ తీసుకోలేద‌ని తెలుస్తోంది. ర‌వితేజ మాత్రం.. ముక్కుసూటిగా కాకుండా డొంక‌తిరుగుడిగా స‌మాధానాలు చెప్పాడ‌ని, రక్త న‌మూనాల్ని సేక‌రించ‌డానికి నిరాక‌రించాడ‌ని సిట్ చెబుతోంది. ముమైత్‌కి ఉన్న ధైర్యం ర‌వితేజ‌కు లేకుండా పోయిందా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.