ట్రైలర్ రివ్యూ : ఛలో.. నాగశౌర్య ఓ హిట్టు కొట్టు

నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఛలో’. వెంకీ కుడుముల దర్శకుడు. నాగశౌర్య ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ లో ఛలో కధను ఓపెన్ చేశారు. ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లో ఓ విలేజ్. గీత దాటితే రాష్ట్రాల పేర్లు మారిపోతాయి. తెలుగోడు అటు పోకూడదు తమిళోడు ఇటు రాకూడదు. అలాంటి ఊరుకి వెళ్తాడు హీరో. అక్కడ కాలేజ్ లో ఓ లవ్ స్టొరీ. తర్వాత ఏమైయిందో తెరపై చూడాలి.

ట్రైలర్ ప్రామెసింగా వుంది. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల, త్రివిక్రమ్ దగ్గర పని చేశాడు. ఆ మెరుపులు విరుపులు ట్రైలర్ కనిపించాయి. ”రాత్రి టీవీలో భాషా సినిమా చూసాన్రా. ఎంత చేసినా తెలుగు చేసినంత ఈజ్ తో ఆయన తమిళ్ లో చేయలేకపోయాడు” . “తెలుగోళ్ళ మీద నీ ఒపినియన్ ఏంట్రా..? పాపం మంచోల్లేర్రా.. పాపం వాళ్ళే కదా బాహుబలి తీసింది” లాంటి డైలాగుల్లో చమక్కులు కనిపించాయి. యాక్షన్ ని కుడా ఫన్ అండ్ స్టయిలీస్ గా తీసినట్లు కనిపించింది. నరేష్, పోసాని, రఘుబాబు, వెన్నల కిశోర్, వైవ హర్ష.. ఇలా పెద్ద బ్యాచ్ నే వుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీలు కూడా చాల రిచ్ గా వుంది.

రెండు ఊర్ల మధ్య జరిగే గొడవ, ప్రేమ కధ.. నేపధ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఈసారి కొంచెం భిన్నం దాన్ని తమిళనాడు ఆంధ్రాకి షిఫ్ట్ చేసి ఫన్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసినట్లు వున్నాడు దర్శకుడు. నాగశౌర్యకి ఇప్పుడు హీరోగా ఒక హిట్ కావాలి. ఆ హిట్ ఇచ్చే లక్షణాలు ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.