మ‌ణిర‌త్నంతో సినిమా ఉంద‌ట‌…

మ‌ణిర‌త్నం వీరాభిమానుల్లో నాని ఒక‌డు. మ‌ణిర‌త్నం సినిమాల గురించి, అందులోని సంగీతం గురించి, సన్నివేశాల గురించీ గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడ‌మ‌న్నా ఓకే అనేస్తాడు నాని. ఓకే బంగారం సినిమాలో స‌ల్మాన్ దుల్క‌ర్ పాత్ర‌ని నాని గాత్ర‌దానం చేసి, ఏకంగా మ‌ణితో సినిమా చేసినంత సంబ‌ర‌ప‌డ్డాడు. నాని స్పీడు, తాను కురిపించిన అభిమానం చూసి మ‌ణిర‌త్నం కూడా ముగ్థుడైపోయాడు. ఒకే బంగారం టైమ్‌లోనే మ‌ణిర‌త్నం నానితో ఓ సినిమా ప్లాన్ చేశారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాని తీద్దామ‌నుకొన్నారు. అప్పుడేతే నాని ఏకంగా ఆకాశంలో తేలిపోయాడు. అయితే ఎందుక‌నో.. ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. నాని డ్రీమ్‌.. అక్క‌డితో ఆగిపోయింది. అయితే… నాని ఇప్పుడో ట్విస్ట్ ఇచ్చాడు. మ‌ణిర‌త్నం సినిమా ఆగిపోలేద‌ని, త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని తెలిపాడు.

”మ‌ణి సార్‌తో క‌ల‌సి ప‌నిచేయాల‌న్న‌ది నా క‌ల‌. ఒకే బంగారం టైమ్‌లో ఆ అవ‌క‌శం కూడా వ‌చ్చింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్టు సెట్ అవ్వ‌లేదు. కానీ ఆగిపోయిన‌ట్టు కాదు. జ‌స్ట్ ఆల‌స్యం అవుతోందంతే. మ‌ణిసార్‌తో త‌ప్ప‌కుండా సినిమా చేస్తా. అతి త్వ‌ర‌లో ఆ సినిమా ఉండొచ్చు” అంటున్నాడు నాని. మ‌ణిర‌త్నం ప్ర‌స్తుతం కార్తితో ఓ సినిమా చేస్తున్నారు. అద‌య్యాకే… నాని సినిమా ఉండొచ్చేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close