‘లై ‘ ట్రైల‌ర్ : బోలెడ‌న్ని అబ‌ద్ధాలు ఉన్నాయ్‌


ఇటీవ‌ల కాలంలో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న సినిమా ఏమైనా ఉందీ అంటే… అది ‘లై’ అని చెప్పొచ్చు! ఫ‌స్ట్ లుక్‌తో మొద‌లైన అంచ‌నాల ప్ర‌వాహం.. టీజ‌ర్ తో బాగా పెరిగిపోయాయి. ఇక ట్రైల‌ర్ ఎలా ఉంటుందో?? సినిమా ఇంకెంత బాగుంటుందో అనిపించింది. ఆ అంచ‌నాల భారం మోసుకొంటూ… ట్రైల‌ర్ వ‌చ్చేసింది. టీజర్‌లో ఉన్న ప‌దును, పొగ‌రు.. ట్రైల‌ర్‌లోనూ క‌నిపించింది. ‘లై’ అనే టైటిల్‌కి జ‌స్టిఫికేషన్ ఇచ్చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో నితిన్ పేరు. ఎ.స‌త్యం. క‌లిపితే… అస‌త్యం అన్న‌మాట‌.

”నా పేరు ఎ.స‌త్యం.. అంటే వాడుక భాష‌లో అస‌త్యం. పొట్ట‌కోసినా, భ‌గ‌వ‌ద్గీత‌మీద ఒట్టేసినా అబ‌ద్ద‌మే చెబుతా. చ‌చ్చినా నిజం చెప్ప‌ను” అనే డైలాగ్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. దాంతో.. టైటిల్‌కి అక్క‌డే జ‌స్టిఫికేష‌న్ జ‌రిగిపోయింది.

”మ‌నం అబ‌ద్దాలే మాట్లాడుకొందాం.. అర్థ‌మైందా” అంటూ మేఘా ఆకాష్ డైలాగ్‌తో అబ‌ద్దాల సంఖ్య రెండుకి చేరింది.

”నువ్వు పెద్ద బాగోవు.. బాగా ఏవ‌రేజ్‌” – నితిన్ చెబుతున్న డైలాగ్ ఒక‌టి.. ఎక్స్‌ప్రెష‌న్ ఒక‌టి. దాంతో అది మ‌రో అబ‌ద్ధ‌మైపోయింది.

”అబ‌ద్ధాల‌కు కూడా అమ్మాయిలు ప‌డిపోతార‌ని ఫ‌స్ట్ టైమ్ తెలిసింది” అని అమ్మాయి అంటే…
”అస‌లు అమ్మాయిలు ప‌డేదే అబ‌ద్దాల‌కు.. పాపం అమాయ‌కులు” అంటూ హీరో డైలాగ్‌తో ‘లై’కి మ‌రింత స్ట్రాంగ్ గా టైటిల్ జ‌స్టిఫికేష‌న్ జ‌రిగిపోయింది.

ల‌వ్ స్టోరీ అయిపోయాక‌.. క‌థ ఒక్క‌సారిగా సీరియెస్ ట‌ర్న్ తీసుకొంది.

”బ‌ల‌హీన‌త లేని బ‌ల‌వంతుడ్ని భ‌గ‌వంతుడు ఇప్ప‌టి వ‌ర‌కూ సృష్టించ‌లేదు” అనే నితిన్ డైలాగ్‌.. ఈ ట్రైల‌ర్‌కే హైలెట్‌.

ఇలా చెప్పుకొంటూ పోతే.. ట్రైల‌ర్‌లో బోలెడ‌న్ని ఛ‌మ‌క్కులు క‌నిపిస్తాయి. సినిమా చూడాల‌న్న ఉత్సాహం ఈ ట్రైల‌ర్‌తో మ‌రింత పెరిగింది. యువ‌రాజ్ టేకింగ్‌, మ‌ణిశ‌ర్మ నేప‌థ్య సంగీతం, శేఖ‌ర్ ఈ ట్రైల‌ర్‌ని క‌ట్ చేసిన విధానం సింప్లీ సూప‌ర్బ్‌. మ‌రో స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చూడ‌బోతున్నాం అనే హింట్ ఇచ్చేసింది ఈ ట్రైల‌ర్‌. ఈనెల 11న ‘లై’ విడుద‌ల కాబోతోంది. ఇదే మ్యాజిక్ బిగ్ స్క్రీన్ పైనా కంటిన్యూ అయితే.. లై నితిన్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిల‌వ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.