జ‌న‌తా గ్యారేజ్ గురించి మాట్లాడ‌ను

స్టార్ హీరోతో సినిమా చేస్తున్నారంటే సంబ‌ర‌ప‌డిపోతారు క‌థానాయిక‌లు. ఆ సినిమా గురించి అడిగినా, అడ‌క్క‌పోయినా మాట్లాడేస్తుంటారు. దాని ద్వారా త‌మ‌కూ కాస్త మైలేజీ ఉంటుంద‌న్నది వాళ్ల న‌మ్మ‌కం. అయితే.. నిత్య‌మీన‌న్ మాత్రం కాస్త డిఫ‌రెంట్ క‌దా? అందుకే త‌న స్పెషాలిటీ మ‌రోసారి చూపించుకొంటోంది. ఎన్టీఆర్ సినిమా జ‌న‌తా గ్యారేజ్‌లో ఛాన్స్ అందుకొంది నిత్య‌. ఎప్ప‌ట్లా ఈ సినిమాలో నిత్య పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో త‌న‌కు స్థానం ద‌క్క‌డం లేద‌ని, ఇది స‌మంత సినిమాగానే చ‌లామ‌ణీ అవుతోంద‌ని, త‌న‌ని క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే చూస్తున్నార‌ని రుస‌రుస‌లాడుతోంద‌ట నిత్య‌. అందుకే జ‌న‌తా గ్యారేజ్ కోసం మాట్లాడ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యింద‌ట‌. 100 డేస్ ఆఫ్ ల‌వ్ కోసం టీవీ ఛాన‌ళ్ల చుట్టూ తిరుగుతూ తెగ ప్ర‌మోష‌న్లు ఇస్తోంది నిత్య‌. అక్క‌డ నిత్య‌ని ఎవ‌రైనా జ‌న‌తా గ్యారేజ్ గురించి మాట్లాడ‌మంటే నిరాక‌రిస్తోంద‌ని టాక్‌.

‘జ‌న‌తా గురించి మాట్లాడ‌ను’ అంటూ మొహం మీదే చెప్పేస్తోంద‌ట‌. ‘ఇది జ‌న‌తాకు సంబంధించిన ప్ర‌మోష‌న్ కాదు’ అని క‌వ‌రింగ్ చేస్తోంద‌ట‌. దీన్ని బ‌ట్టి జ‌న‌తా గ్యారేజ్ టీమ్‌తో.. నిత్య‌కు చెడింద‌న్న విష‌యం స్ప‌ష్టంగానే అర్థ‌మ‌వుతోంది. ఈసినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ల‌లో నిత్య పాల్గొంటుందా, లేదా? అనే అనుమానాలు నెల‌కొన్నాయి. నిత్య ప్ర‌మోష‌న్ల‌కు రానంత మాత్రాన‌.. పెద్ద న‌ష్ట‌మేం జ‌ర‌క్క‌పోవొచ్చు. కానీ.. నిత్య‌కు మాత్రం లాసే! నిత్య ఇదే ధోర‌ణిలో ముందుకెళ్తే.. త‌న కెరీర్ ఇబ్బందుల్లో ప‌డే ప్ర‌మాదం ఉంది. జ‌న‌తా గ్యారేజ్ టీమ్ కూడా `నిత్య లేక‌పోయినా మ‌న‌కు ప్రాబ్లం లేదు క‌దా` అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. సో.. ఈ గొడ‌వ ఇప్ప‌ట్లో తెగేది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close