తెలుగు రాష్ట్రాల్లో నామినేష‌న్లు షురూ…

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి మ‌రింత ప‌దునెక్క‌నుంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ గురువారం నుండి మొద‌ల‌వుతుండ‌టం, మంచి రోజు కావ‌టంతో మొద‌టి రోజే నామినేష‌న్లు భారీగా దాఖ‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీకి, లోక్ స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా… తెలంగాణ‌లో 17 లోక్ స‌భ స్థానాల‌కు నామినేష‌న్లు మొద‌ల‌వుతున్నాయి.

ఉద‌యం 11గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 3గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రిస్తుండ‌గా, ఏపీ, తెలంగాణ స‌హా మొత్తం ప‌ది రాష్ట్రాల్లో 96 స్థానాల‌కు ఈ విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 25వ‌ర‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేసుకునే అవ‌కాశం ఉండ‌గా, 29 వ‌ర‌కు విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

ఇక మొద‌టి రోజే ప్ర‌ధాన అభ్య‌ర్థులు ఎక్కువ‌గా నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌బోతున్నారు. ఏపీలో మంగ‌ళ‌గిరి సెగ్మెంట్ నుండి పోటీ చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ మొద‌టి రోజే నామినేష‌న్ వేయ‌బోతున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ స‌హా బీజేపీ నేత‌ల నామినేష‌న్ల కార్య‌క్ర‌మానికి బీజేపీ పెద్ద‌లు హ‌జ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

ఇటు తెలంగాణ‌లోనూ మొద‌టి రోజు నుండే నామినేష‌న్ల జాత‌ర సాగుతుండ‌గా… బీజేపీ అభ్య‌ర్థుల నామినేష‌న్ కార్య‌క్ర‌మాల‌కు పార్టీ పెద్ద‌లు రాబోతున్నారు. బీఆర్ఎస్ నేత‌ల‌కు గురువారమే భీఫాంలు ఇవ్వ‌నుండ‌గా, కాంగ్రెస్ అభ్య‌ర్థులు త‌మ ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తార‌ని…సీఎం రేవంత్ రెడ్డి రోజుకు రెండు స‌భ‌లు, రోడ్ షోలు నిర్వ‌హించేలా రూట్ మ్యాప్ ఖ‌రారు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close