చిరంజీవిని కలిసిన పవన్ కళ్యాణ్

ఇవ్వాళ్ళ మెగా ఫ్యామిలీలో చాలా ఆసక్తికరమయిన సంఘటన జరిగింది. చిరంజీవి 150వ సినిమా (బ్రూస్ లీ) విడుదలయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం (బొకే) ఇచ్చి అభినందనలు తెలియజేసారు. ఆయన కూడా తన తమ్ముడుని సాదరంగా ఆహ్వానించి బోకే అందించారు. ఆ సమయంలో రామ్ చరణ్ తేజ్ కూడా అక్కడే ఉన్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ కాసేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొన్నారు.

మరో విశేషం ఏమిటంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్న పవన్ కళ్యాణ్ షూటింగ్ నుండి నేరుగా అదే వేషంలో తన అన్నయ్య ఇంటికి వెళ్ళారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ, తామిద్దరం రాజకీయంగా విభేదిస్తున్నప్పటికీ ఒకే కుటుంబ సభ్యులుగా, సినీ పరిశ్రమకు చెందినవారిగా ఒకరినొకరు ఎల్లప్పుడూ అభిమానించుకొంటూనే ఉంటామని అన్నారు. తన అన్నయ్యతో రాజకీయంగా విభేదించినప్పటికీ ఆయనంటే తనకు చాలా ఇష్టం, గౌరవమని తెలిపారు. అన్నయ్య మళ్ళీ చాలా కాలం తరువాత సినిమాలలోకి రావడం తనకు చాలా ఆనందం కలిగించిందని అన్నారు. శంకర్ దాదా సినిమాలో తను అనుకోకుండా నటించానని అన్నారు. రామ్ చరణ్ తేజ్ తో కలిసి నటించేందుకు రెండు మూడు కధలు విన్నామని ఇంకా దేనిని ఫైనల్ చేయలేదని అన్నారు. తన సర్దార్ గబ్బర్ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని తెలిపారు. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలని ఉన్నప్పటికీ గుజరాత్ సినిమా షూటింగ్ కి హాజరు కావలసి ఉన్నందున, ఆ కార్యక్రమానికి హాజరు కాగాలనో లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా రాజకీయాలలోకి వచ్చిన తరువాత అన్నదమ్ముల మధ్య చాలా దూరం పెరిగింది. గత 15నెలల్లో ఏదో ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే వారిరువురూ కలుసుకొన్నారు. మళ్ళీ ఇప్పుడే కలుసుకొన్నారు. వారి కలయిక మెగా అభిమానులు అందరికీ సంతోషం కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close