నా ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి: మోడి

ప్రధాని నరేంద్ర మోడి ఆదివారం ఓడిశాలో బారగర్ అనే ప్రాంతంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “కొన్ని రాజకీయ శక్తులకు వేరే పనేమీ ఉండదు నన్ను విమర్శించడం తప్ప. ఎందుకంటే నేను అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అంతం చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాను. దాని వలన ఇబ్బందిపడుతున్న కొన్ని శక్తులు, వర్గాలు ఏదో విధంగా నన్ను తప్పించి నా ప్రభుత్వాన్ని కూల్చి వేయాలని కుట్రలు పన్నుతున్నాయి.”

“యూరియా బ్లాక్ మార్కెట్ ని అరికట్టడానికి దానిపై వేపనూనె పూత పోయడం తప్పనిసరి చేసింది మా ప్రభుత్వం. ఆవిధంగా చేసిన తరువాత నుండి ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా యూరియా కొరత ఉన్నట్లు పిర్యాదులు అందలేదు. వేపనూనె పూసిన యూరియా రైతులకు సకాలంలో అందుతుండటం వలన వారు చాలా లాభపడుతుంటే, యూరియాని నల్లబజారులో అమ్ముకొనే వారు చాలా నష్టపోతున్నారు. అటువంటి వారు కొందరు రాజకీయ పార్టీలతో చేతులు కలిపి నా ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అటువంటివాటికి నేను భయపడేది లేదు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ప్రజలు నాకు అప్పగించిన ఈ భాద్యతను సక్రమంగా నిర్వహిస్తాను.”

“నా ప్రభుత్వం కేవలం పరిశ్రమల పట్లే ఆసక్తి చూపుతోందనే దుష్ప్రచారంలో కూడా నిజం లేదు. ఎందుకంటే స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ద్వారా వ్యవసాయాధారిత పరిశ్రమలు వస్తే దానివలన రైతులే లాభపడతారు. రైతులు మరింత నాణ్యమయిన ఉత్పత్తులు పండించేందుకు, వాటిని మార్కెటింగ్ చేసుకొనేందుకు అవసరమయిన శిక్షణను ఇచ్చేందుకే ముద్రా యోజనా పధకాన్ని ప్రవేశపెట్టాము. 2022 నాటికి మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. అప్పటిలోగా దేశంలో రైతులందరి ఆదాయం రెండింతలు పెరిగేవిధంగా మా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది,” అని మోడీ చెప్పారు.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని బీజేపీ తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించినప్పుడు ఆయన పార్టీలోను, బయటా అనేక సవాళ్ళను ఎదుర్కొని, తన సత్తా చాటుకొని ప్రధాని కాగలిగారు. ఒక సాధారణ ‘ఛాయ్ వాలా’ 125 కోట్లు మంది జనాభా ఉన్న దేశానికి ప్రధాని కావడం ఒక విశేషమనుకొంటే, ప్రధానిగా ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ అధికారం చేపట్టిన ఆరు నెలలోనే మంచి సమర్దుడయిన ప్రధానిగా పేరు సంపాదించుకొన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు సభలో తన ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయి, అని బహిరంగంగా చెప్పడం చాలా విస్మయం కలిగిస్తుంది. ఇంతకంటే ఎన్నో క్లిష్టమయిన సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కొన్న నరేంద్ర మోడీ, తన ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎందుకు చెప్పుకొన్నారో తెలియదు కానీ అలాగ చెప్పడం కంటే వాటిని సమర్ధంగా తిప్పికొట్టి ఆ విషయం గురించి చెప్పుకొంటే గొప్పగా ఉండేది. మోడీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గత 22 నెలలుగా చేయని ప్రయత్నం లేదు. బహుశః కాంగ్రెస్ పార్టీని ఉద్దేశ్యించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారేమో?

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close