నిర్మాత కోసం ‘అ!’ దర్శకుడి కథ

చేపపిల్లకు వాయిస్ ఓవర్ ఇవ్వమని అడగడానికి వెళితే… కథ నచ్చేసి ఏకంగా సినిమా ప్రొడ్యూస్ చేశాడు యంగ్ హీరో నాని. దాంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ దశ తిరిగింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు… చక్కటి ప్రొడక్షన్ హౌస్ లో పడ్డాడు. హ్యాపీగా డైరెక్షన్ మీద కాన్సంట్రేట్ చేసి మంచి సినిమా తీశాడు. హిట్ కొట్టాడు. ‘అ !’తో నిర్మాతగా నానికి, దర్శకుడిగా ప్రశాంత్ వర్మకు మంచి పేరొచ్చింది. చాలామంది నిర్మాతలు, హీరోల కన్ను ప్రశాంత్ వర్మ మీద పడింది. మంచి కథతో వస్తే సినిమా చేయడానికి సిద్ధమంటూ అతడికి ఆఫర్స్ ఇచ్చారు. అతడు మాత్రం దర్శకుడిగా తనని పరిచయం చేసిన నాని హీరోగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం నాని కోసం కథ సిద్ధం చేసే పనిలో వున్నాడు. ”త్వరలో నాని హీరోగా సినిమా తీయాలనుకుంటున్నాను” అని ప్రశాంత్ వర్మ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు మాత్రం నాని నిర్మాత కాదు. ఎందుకంటే… సొంత బ్యానర్లో నటించనని నాని క్లారిటీ ఇచ్చాడు. కొత్తవాళ్ళు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ ని ఎంకరేజ్ చేయడానికి బ్యానర్ స్టార్ట్ చేశానని చెప్పాడు. మరి, నాని హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాను ఎవరు నిర్మిస్తారో? నాని కథ ఓకే చేస్తే నిర్మాతలు కరువా ఏంటి?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.