అస‌లు విష‌యాలు వ‌దిలేస్తున్న రాహుల్!

ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. ఈసారి హాలీ డే ట్రిప్ కాదులెండి. ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్(ఏఐ) పై అధ్య‌య‌నం చేయ‌డం కోసం వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఏఐ ప‌రిశోధ‌న‌లు చేస్తున్న ప‌లువురు దిగ్గ‌జాల‌ను ఆయ‌న క‌లుసుకుంటారట‌. నిజానికి, మ‌న‌దేశంలో ఇంకా దీనిపై పెద్ద‌గా అధ్య‌య‌నాలు జ‌ర‌గ‌డం లేదు. చైనా లాంటి దేశాలు ఏఐ రీసెర్చ్ కోసం భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నాయి. ఇంత‌కీ, ఉన్న‌ట్టుండి రాహుల్ గాంధీ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారంటే… భార‌తీయ సాఫ్ట్ వేర్ రంగం స్థాయి పెంచాల‌ని అనుకుంటున్నార‌ట‌! కాంగ్రెస్ పార్టీ విజ‌న్ డాక్యుమెంట్ లో ఈ ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ ను కూడా చేర్చబోతున్నార‌ట‌. ఈ మ‌ధ్య నార్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రాహుల్ గాంధీ, బయోటెక్నాల‌జీ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు సిలికాన్ వేలీకి వెళ్లి ఏఐ మీద అధ్య‌య‌నం చేస్తారు.

అంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు కావాల్సిన సాధ‌నా సంప‌త్తిని త‌యారు చేసుకునే క్ర‌మంలో రాహుల్ ఉన్నార‌ని చెప్పొచ్చు. ఈ అధ్య‌య‌నం మంచిదే. కానీ, మ‌న‌దేశంలో చేయాల్సిన అధ్య‌య‌నాలు కూడా కొన్ని ఉన్నాయి. 2014లో కాంగ్రెస్ ఓట‌మికి కార‌ణ‌మేంటో రాహుల్ అధ్య‌య‌నం చేయాలి. మోడీ హ‌వా వ‌ల్ల మాత్ర‌మే కాంగ్రెస్ ఓడిపోలేదు! కాంగ్రెస్ పై దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు వ‌చ్చిన విసుగు వ‌ల్ల మోడీ ప్ర‌త్యామ్నాయం అయ్యారు. అప్ప‌టికే పెద్ద ఎత్తున కుంభ‌కోణాలు, అవినీతి ఆరోప‌ణ‌లు కాంగ్రెస్ నేత‌ల‌పై వ‌చ్చాయి. 2జీ, బొగ్గు కుంభ‌కోణం వంటివి దేశాన్ని కుదిపేశాయి. దీంతో ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పై న‌మ్మ‌కం పోయింది. ఈ ప‌రిస్థితుల్లో భాజ‌పా పుంజుకుంది. ఇప్ప‌టికైతే మోడీ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేదు. దీన్ని దాటి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాల‌ని ప్ర‌జ‌లు ఎందుకు అనుకోవాలి..? బ‌యోటెక్నాలజీపైనా, ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్ పైనా ఏవో కొన్ని హామీలు ఇస్తే స‌రిపోతుందా..? వాటికంటే మోడీ స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై రాహుల్ అధ్య‌య‌నం చేస్తే బాగుంటుంది.

దేశ ప్ర‌జ‌ల‌ను నిలువునా క‌ష్టాల్లోకి నెట్టేసిన పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై కాంగ్రెస్ పోరాడిందేం లేదు! ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు కార‌ణ‌మైన ఆ నిర్ణ‌యంతో మోడీ స‌ర్కారు సాధించిందేం లేదు. మోడీ స‌ర్కారు భారీ వైఫ‌ల్యం ఇది. దీన్ని ప్ర‌జ‌ల్లోకి కాంగ్రెస్ స‌మ‌ర్థంగా తీసుకెళ్ల‌లేక‌పోతోంది. ఇక‌, రాష్ట్రాల‌వారీగా చూసుకుంటే… అధికారంలోకి రావ‌డం కోసం భాజ‌పా చేస్తున్న రాజ‌కీయ‌మేంటో చూస్తున్నాం. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో భాజ‌పా చేసిన రాజ‌కీయంపై అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు. త‌మిళ‌నాడులో రాజ‌కీయ అస్థిర‌త‌కు కార‌ణం ఎవ‌రు..? బీహార్ లో అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం లాలూ కుటుంబంపై క‌క్ష క‌ట్టిందెవ‌రు..? ఇలా అధికారం కోసం ఏదైనా చెయ్య‌డానికి సిద్ధ‌మౌతున్న భాజ‌పా తీరుపై రాహుల్ అధ్య‌య‌నం చేస్తే బాగుంటుంది. వాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తే పార్టీకి ఎంతోకొంత మేలు జ‌రుగుతుంది. అంతేగానీ, విదేశాలూ టెక్నాల‌జీలూ అంటూ ఈ స‌మ‌యంలో ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోవ‌డం స‌రైన వ్యూహం కాద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close