ర‌జ‌నీ సినిమా గురించి బ‌య‌ట‌ప‌డిపోయిన జ‌క్క‌న్న‌

రాజ‌మౌళి – ర‌జ‌నీకాంత్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంద‌ని టాలీవుడ్ లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇటీవ‌ల కొంత‌మంది త‌మిళ నిర్మాత‌లు కూడా రాజ‌మౌళితో చూచాయిగా ఈ విష‌యం గురించి చర్చించార‌ని భోగ‌ట్టా. ఈ విష‌యంపై ఎట్ట‌కేల‌కు రాజమౌళి నోరు విప్పాడు. ర‌జ‌నీతో సినిమా చేయాల‌ని ప్ర‌తీ ఒక్క ద‌ర్శ‌కుడూ క‌ల కంటార‌ని, తానూ దీనికి అతీతుడ్ని కాద‌ని తేల్చేశాడు. ర‌జ‌నీకి స‌రిప‌డా క‌థ దొరికితే.. త‌ప్ప‌కుండా ఆ సినిమా ప‌ట్టాలెక్కేస్తుందని, నిజంగా ఈ కాంబినేష‌న్ సెట్ట‌యితే త‌న‌కంటే ఆనందించే వ్య‌క్తి మ‌రొక‌రు ఉండ‌ర‌ని చెప్పుకొచ్చాడు రాజ‌మౌళి.

ర‌జ‌నీ – రాజ‌మౌళి సినిమా అనేది ప‌క్కా. అయితే అదెప్పుడ‌న్న‌ది కాల‌మే చెప్పాలి. రోబో 2 త‌ర‌వాత ర‌జ‌నీ ఖాళీ అవుతాడు. రోబో త‌ర‌వాత ర‌జ‌నీ పెద్దగా సినిమాలు చేయ‌క‌పోవొచ్చు. కాబ‌ట్టి.. రాజ‌మౌళి ద‌గ్గ‌ర చాలా త‌క్కువ స‌మ‌య‌మే ఉంది. అందుకే వీలైనంత త్వ‌ర‌గా త‌న క‌ల‌ని సాకారం చేసుకొనే దిశ‌గా రాజ‌మౌళి ముందడుగు వేస్తాడ‌న్న‌ది త‌థ్యం. బాహుబ‌లి 2 త‌ర‌వాత రాజ‌మౌళి ఏ సినిమా చేస్తాడ‌న్న విష‌యంపై ఇంకా క్లారిటీ లేదు. ఏ హీరోకీ, ప్రొడ్యూస‌ర్‌కీ క‌మిట్‌మెంట్ ఇవ్వ‌లేదు. బ‌హుశా ర‌జ‌నీ కోస‌మే రాజ‌మౌళి కూడా ఎదురుచూస్తుండొచ్చు.ర‌జ‌నీకి స‌రిప‌డా క‌థ వండ‌డానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌కి పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవొచ్చు. ర‌జ‌నీతో సినిమా అంటే దాన్ని బాలీవుడ్‌లోనూ బాగానే అమ్ముకోవొచ్చు. కాబ‌ట్టి బాహుబ‌లి 2 త‌ర‌వాత ర‌జ‌నీతో క‌మిట్ అయితేనే బెట‌ర్‌. కాక‌పోతే స‌డ‌న్‌గా ర‌జ‌నీతో చేయ‌కుండా మ‌ధ్య‌లో ఓ చిన్న ప్ర‌యోగాత్మ‌క చిత్రం తెర‌కెక్కిస్తే ఎలా ఉంటుందా? అని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ట‌. ర‌జ‌నీకాంత్ గ‌నుక ఒక వేళ ఒత్తిడి పెంచితే, విజ‌యేంద్ర ప్ర‌సాద్ ర‌జ‌నీకి సూటైన క‌థ వీలైనంత త్వ‌ర‌గా వండేస్తే… త‌ప్ప‌కుండా ర‌జ‌నీ – రాజ‌మౌళి కాంబో తెర‌పై చూసేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com