వేల కోట్లు దొరికాయనే ప్రెస్‌నోట్లు తప్ప ఐటీ శాఖ కేసులు ఉండవా..?

దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ ఫుల్ స్వింగ్‌లో ఉంది. విస్తృత సోదాలతో వేల కోట్ల అక్రమాస్తులు.. లావాదేవీల గుట్టును బయట పెడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువ. గత కొన్నాళ్లుగా..ఏదో ఓ భారీ దాడులు కామన్‌గా చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ .. ఇలా … ప్రతీ రాష్ట్రంలో ప్రతి ప్రముఖ వ్యాపార సంస్థపైనా దాడులు జరిగాయి. విజయ్ లాంటి సెలబ్రిటీలనూ వదిలి పెట్టలేదు. ఇలాంటి సమయంలో.. గత వారం … దేశవ్యాప్తంగా 40 చోట్ల జరిపిన సోదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల్లో రూ. రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లుగా ప్రకటించింది. ఇది రాజకీయ పరంగా.. మంటలు రేపడానికి అవసరమైన సరంజాను ఇచ్చినట్లయింది.

ఐటీ శాఖ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటి సారి కాదు.. కొన్నాళ్ల క్రితం… తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆత్మీయుడైన ఓ బడా కాంట్రాక్టర్ కంపెనీపైనా దాడులు జరిగాయి. మీడియాలోనూ.. అడుగు పెట్టిన ఆయన ఇల్లు, కార్యాలయాల్లో.. పది రోజుల పాటు సోదాలు చేశారు. అప్పుడు.. కూడా కొన్ని వేల కోట్ల లావాదేవీలు గుర్తించారు. నిన్న విడుదల చేసినట్లుగానే.. ఫేక్ కంపెనీలు..ఇన్వాయిస్‌లు.. డొల్ల కంపెనీలు అంటూ..అందులో లెక్కలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముఖ్యుడికి రూ. 1400 కోట్లు అందినట్లుగా గుర్తించామన్నారు. ఇలాంటి వివరాలతో ఆ ప్రెస్ నోట్ వచ్చింది. కానీ.. సదరు కంపెనీ.. ఆ కంపెనీ బాధ్యులపై ఏ చర్యలు తీసుకున్నారో క్లారిటీ లేదు.

ఇవి మాత్రమే కాదు.. తమిళనాడులో ఐటీదాడుల్లో .. నోట్ల కట్టల బస్తాలు బయపడ్డాయి.. కర్ణాటకలోనూ అంతే. వేల కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తున్నట్లుగా ప్రకటిస్తున్న ఐటీ అధికారులు .. ఏం చర్యలు తీసుకుంటున్నారో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. నాడు శేఖర్ రెడ్డి అనే ఓ టీటీడీ బోర్డు మెంబర్ ఇంట్లో.. కొత్త నోట్లు కోట్లకు కోట్లు దొరికితే పట్టుకున్నారు. అప్పుడు ప్రజలంతా.. ఏటీఎంల ముందు క్యూల్లో ఒక్క నోటు కోసం నిల్చుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కోట్లకు కోట్ల శేఖర్ రెడ్డి వద్దకు ఎలా చేరాయో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ ఆయనకు క్లీన్ చిట్ ఐటీ అధికారులే ఇచ్చారు. అన్నీ ఇలాంటి వ్యవహారాలే బయట పడుతున్నాయి. అంతకు మించి రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారానికే ఈ సోదాలు ఉపయోగపడుతున్నాయి. కానీ నిజంగా అక్రమార్కులను మాత్రం శిక్షించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close