రేవంత్‌కు కౌంటర్లు వచ్చేది కాంగ్రెస్ నుంచే !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయం చేయడం అంటే తమ పార్టీలో తాము రాజకీయం చేసుకోవడం.. ఒకరుపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన దానికి భిన్నంగ మాట్లాడటం క్రేజ్ అనుకుంటున్నట్లుగా ఉన్నారు. రాజకీయ వ్యూహాలు.. ఇతర ఆలోచనల్లాంటివేమీ పట్టించుకోకుండా మీడియాను పిలిచి.. చిట్ చాట్‌లు చేసి భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందిన సివిల్ సర్వీస్ అధికారులకు పెద్దగా ప్రాదాన్యం దక్కడం లేదని విమర్శలు చేశారు. అదే సమయంలో బీహార్ క్యాడర్ అధికారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని .. వారంతా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.

అయితే దీనిపై ఐపీఎస్‌ల సంఘం.. ఐఏఎస్‌ల సంఘాలు స్పందించాయి. అంటే ఈ ఇష్యూ వారిని కదిలించినట్లే. దీన్నే అందుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారుల కోసం మరింత జోరుగా మాట్లాడటం ప్రారంభించారు. ఆయనకు కొంత మంది తెలంగాణ సివిల్ సర్వీస్ అధికారుల సపోర్ట్ అంతర్గతంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి.. తెలంగాణ ఆత్మగౌరవ సెంటిమెంట్‌ను పెంచుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు… వెంటనే రివర్స్ గేరేశారు.

ముందు రేవంత్ ఎడ్డేమంటే తెడ్డేమనే వీహెచ్ రంగంలోకి దిగి .. బీహార్ అధికారుల్ని వెనకేసుకొచ్చి రేవంత్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్ తీసుకున్నారు. ఆయన మరింత వ్యూహాత్మకంగా మీడియాను పిలిచి.. చిట్ చాట్‌గా మాట్లాడి బీహార్ అధికారులు కూడా దేశంలో బాగమేనంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. ఒక్క మధుయష్కీ యే కాదు.. చాలా మంది కాంగ్రెస్ నేతలది అదే పరిస్థితి. ప్రత్యర్థి ని బట్టి రాజకీయం చేయడంలో ఎప్పుడు విఫలమవుతారో.. అప్పుడే రాజకీయం ఫెయిలయినట్లు.. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు ముందుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close