బ‌న్నీతో.. ఇద్ద‌రు హీరోయిన్లా?

ప్ర‌స్తుతం ‘పుష్ష 2’తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్‌. ఆ త‌రువాతి సినిమా ఏమిట‌న్న విష‌యంలో ఇప్పుడిప్పుడే క్లారిటీ వ‌స్తోంది. ‘పుష్ష 2’ అవ్వ‌గానే అట్లీతో సినిమాని ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఈనెల 8న బ‌న్నీ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా అట్లీ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఇప్ప‌టికే బ‌న్నీ కోసం ఓ ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌ని రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు అట్లీ. క‌థానాయిక‌ల వేట కూడా మొద‌లెట్టేశాడ‌ట‌. ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఇది వ‌రకు త్రిష పేరు వినిపించింది. ఇప్పుడు స‌మంత పేరు ఖాయ‌మైందంటూ వార్త‌లొస్తున్నాయి. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాలో ఒక‌రు కాదు… ఇద్ద‌రు హీరోయిన్లు క‌నిపించే అవ‌కాశం ఉంద‌ట‌. ఆ ఇద్ద‌రూ త్రిష‌, స‌మంత‌నే అని తెలుస్తోంది. బ‌న్నీ ప‌క్క‌న స‌మంత ఇది వ‌ర‌కు న‌టించింది.కానీ త్రిషతో ఇదే తొలి సినిమా అవుతుంది. బ‌న్నీ – త్రిష కాంబో.. కాస్త కొత్త‌గా అనిపించే అంశ‌మే. అందుకే అట్లీ.. త్రిష వైపు మొగ్గు చూపిస్తున్నాడ‌ట‌. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవ‌కాశాలు ఉన్నాయి. స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతోంది. త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి శ్రీ‌నుల‌తో చెరో సినిమా చేయాలి బ‌న్నీ. వాటికి సంబంధించిన అప్ డేట్స్ కూడా బ‌న్నీ బ‌ర్త్ డేకి రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close