ఇక్కడ దెయ్యాలు అమ్మబడును !

(సెటైర్)

వెంగళప్పకు ఎంతో కాలం నుంచి ఒక బలమైన కోరిక ఉంది. ఎప్పటికైనా బిజినెస్ మ్యాన్ కావాలన్నదే అతగాడి ఆశయం. ఈమధ్య చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సర్కోబా గ్రామానికి వెళ్ళొచ్చినప్పటి నుంచీ అతగాడిలో వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఇంకా బలపడింది. ఉన్నట్టుండి తన చిరుద్యోగానికి గుడ్ బై కోట్టేసి షాప్ పెట్టాడు. షాప్ ఓపెనింగ్ కి మంచిరోజు గట్రాలాంటివేమీ పట్టించుకోలేదు. ఎవరు చెప్పినా వినకుండా ఆదివారం అమావాస్య అర్థరాత్రి 12 గంటలకు షాప్ ఓపెనింగ్ అంటూ అందరికీ ఆహ్వానం అందించాడు.

ఇప్పుడిది ఊర్లో హాట్ టాపికైపోయింది. బతికున్నవాడు ఎవ్వడూ ఇలా అర్థరాత్రివేళ అందునా ఆదివారం -అమావాస్యనాడు వ్యాపారం ప్రారంభించరని అంతా నోళ్లునొక్కుకున్నారు. జనం ఏమనుకున్నా వెంగళప్ప పట్టించుకోలేదు. ఎవరొచ్చినా రాకపోయినా తన షాప్ ని అనుకున్నట్టుగానే ప్రారంభించాడు.

అర్థరాత్రిపూట షాప్ ఓపెనింగ్ కు వెళ్ళే ధైర్యంలేని ఊరి ప్రజలు తెల్లారాక తీరుబడిగా షాపుదగ్గరకు వెళ్ళి షాపు ముందున్న బోర్డ్ చూసి ఉలిక్కిపడ్డారు. ఊరి శివారు ప్రాంతంలో శ్మశానానికి చేరువలో ఉందాషాప్. షాప్ ముందు పెద్ద బోర్డు కట్టాడు. ఆ బోర్డుపై తాటికాయంత అక్షరాలు…. `ఇక్కడ అన్ని రకాల దెయ్యాలు అమ్మబడును’

ఆ అక్షరాలు చదవగానే ఎవరికివారికి వెనక నుంచి దయ్యం తమ వీపులపై చరిచినట్లు ఉలిక్కిపడ్డారు. పైగా ఆ వాక్యం క్రింద మరో లైన్… `హోల్ సేల్ ధరలకే అమ్మబడును’ అని…

అంతలో షాప్ నుంచి బయటకు వచ్చిన వెంగళప్ప తన గొంతు సవరించుకుంటూ…

`అయ్యా ఊరి పెద్దలారా, మీరంతా రాత్రి నా షాప్ ఓపెనింగ్ కు వచ్చినందుకు చాలా సంతోషం. అంతేగాకుండా తెల్లవారగానే మళ్ళీ విచ్చేసి నా వద్ద ఉన్న సరుకు…అదే దెయ్యాలను కొనడానికి ఇలా క్యూ కట్టినందుకు ఇంకా సంతోషం’

`ఏమిటీ ! మేము రాత్రి వచ్చామా ?? మేము రాలేదయ్యా వెంగళప్పా…ఎవర్ని చూసి ఎవరనుకున్నావో ఏమో..’

`మరి ఎవరు వచ్చారబ్బా… ఆఁ..అర్థమైంది. నా షాప్ ఓపెనింగ్ పంక్షన్ సక్సెస్ కావడం కోసం మీ బదులుగా మీ ఆత్మలు వచ్చిఉంటాయి’

`మా ఆత్మలేంటీ ?! నీ పిండాకూడు… మేము బతికేఉన్నాంగా’ ఊరి పూజారి గట్టిగా అరచినంతపని చేశాడు.

`ఓహ్… అయితే మరి వచ్చింది ఎవరంటారు ?? ‘ ప్రశ్నించాడు వెంగళప్ప.

వీడికేదో పిచ్చిపట్టిందనుకున్నారు ఊరి జనం. అయినా ఇదేం మాయరోగం. ఇలాంటి షాప్ ఎవరైనా పెట్టుకుంటారా? మొన్న ఛత్తీస్ గఢ్ వెళ్ళినప్పటి నుంచి వీడికేదో అయిందనుకున్నారు గ్రామస్థులు.

ఇంతలో మళ్ళీ వెంగళప్ప అందుకున్నాడు…

`నా ప్రియమైన కొనుగోలుదారులారా…. ఇవ్వాళ్టి నుంచి దెయ్యాల కోసం మీరు ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు. ఇక్కడే అన్నీ సరసమైన ధరలకు దొరుకుతాయి. ఇవ్వాళ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. త్వరబడండి…ఆలసించిన ఆశాభంగం’ అంటూ వ్యాపారధోరణిలో అరిచేస్తున్నాడు.

`దయ్యాలను అమ్మడమేంట్రా నీ బొంద. ఇలాంటి పాడు ఆలోచన ఎలా వచ్చిందిరా…? పైగా ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా ఇస్తావా…! నీ శార్థం పెట్టా…ఇదేమన్నా ఉల్లిపాయలా, కందిపప్పా…?? ఒక కిలోకి మరొ కిలో ఇస్తానంటే ఎగబడి కొనడానికి. దెయ్యాలను అమ్మాలన్న ఆలోచన ఎలా వచ్చిందిరా వెధవ…’ తిట్టినతిట్టు తిట్టకుండా దండకం అందుకున్నాడు పూజారి.

పూజారి తిట్లకు భయపడి అసలు విషయం కక్కేశాడు వెంగళప్ప. తానీమధ్య ఛత్తీస్ గఢ్ లోని సర్కోబా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడో వ్యక్తి ఇలాగే దెయ్యాలతో వ్యాపారం పెట్టేసి బాగా సంపాదించడం చూశాడట. ఈ మధ్య వచ్చిన సూర్యా నటించిన `రాక్షసుడు’ అనే సినిమా చూసిన తర్వాత మంచి దెయ్యాలతో మనకు నచ్చిన పనులు చేయిస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చన్న నమ్మకం పెరిగిపోయి దెయ్యాలతో వ్యాపారం మొదలుపెట్టాడట ఆ గ్రామస్థుడు.

అంతే, వెంగళప్ప ఊరికి రాగానే అదే ఫార్ములాతో ఎంచక్కా దెయ్యాలు అమ్మే షాప్ పెట్టాలనుకున్నాడు. వెంటనే ఉద్యోగం మానేసి రాత్రికిరాత్రి షాప్ పెట్టేశాడు. ఈ వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెబుతుండగానే మరి ఎలా తెలిసిందోఏమోగానీ పోలీసులు వచ్చేసి వెంగళప్పను అమాంతం జీప్ లో ఎక్కించేసుకుని వెళ్ళిపోయారు. గ్రామస్థులు షాపు ముందు పెట్టిన బోర్డును పీకేసి దానిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.

జైల్లో నాలుగు నెలలు ఉండేసరికి వెంగళప్పకు బుద్ధి కుదిరింది. ఊర్లోకి తిరిగొచ్చాక గ్రామస్థుల సహకారంతో అక్కడే అదే షాపులో పూలదండలు అమ్మే షాపు పెట్టాడు. ఇది బాగా వర్క్అవుట్ అయింది. ఎందుకంటే షాప్ పక్కనే శ్మశానం ఉండటంతో.

(ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జశ్ పూర్ ప్రాంతంలోఉన్న సర్కోబా గ్రామంలో నారాయణ యాదవ్అనే వ్యక్తి దెయ్యాలను అమ్ముతానంటూ మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటూ చివరకు జైలుపాలైనట్టు వచ్చిన వార్త ఆధారంగా….)

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close