విజ‌య్‌దేవ‌ర‌కొండ – క్రాంతిమాధ‌వ్.. స్క్రిప్టు రెడీ!

పెళ్లిచూపులు సినిమాతో పాపుల‌ర్ అయ్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అర్జున్‌రెడ్డితో ఏకంగా స్టార్‌గానే మారిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తూనే ఉంది. మ‌రోవైపు విజ‌య్‌కి కొత్త ద‌ర్శ‌కుల‌, నిర్మాత‌ల తాకిడి ఎక్కువ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి క్రాంతిమాధ‌వ్ ఓ క‌థ చెప్పి ఒప్పించాడు. ఓన‌మాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానీరోజుతో నిరూపించుకొన్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్‌. ఇప్పుడు సునీల్ తో ఉంగ‌రాల రాంబాబు అనే సినిమా తెర‌కెక్కించాడు. ఈనెల 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఆ త‌ర‌వాత విజ‌య్ తో సినిమా చేస్తున్నాడు క్రాంతిమాధ‌వ్‌. ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు పూర్త‌యిపోయాయి. ఇదో ప్రేమ‌క‌థ అని తెలిసింది. ఈ సినిమాపై క్రాంతిమాధ‌వ్ మాట్లాడుతూ ”సినిమా సినిమాకీ ఓ కొత్త జోన‌ర్‌ని ట‌చ్ చేయాల‌న్న ప్ర‌య‌త్నం నాది. విజ‌య్‌తో చేసే సినిమా ప‌క్కా ల‌వ్ స్టోరీ. అయితే అందులో ఓ నిజాయ‌తీతో కూడిన కొత్త పాయింట్ ఉంటుంది. విజయ్‌ని కొత్త కోణంలో చూపిస్తున్నా. త‌న పాత్ర‌లోనూ చాలా షేడ్స్ ఉంటాయి. క‌థానాయిక పేరు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌”న్నారు క్రాంతిమాధ‌వ్‌. కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి నుంచి సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.