సుకుమార్ తెలివే తెలివి

రంగ‌స్థ‌లం.. ఆ టైటిల్‌, అందులోని గెట‌ప్ చూస్తే ఏమ‌నిపిస్తోంది? ఇదేదో ఆర్ట్ సినిమాలా ఉందే అనుకొంటాం క‌దా? పైగా ఈ సినిమాపై ముందు నుంచీ ఓ సాఫ్ట్ కార్న‌ర్ ఉండిపోయింది. రామ్ చ‌ర‌ణ్ చెవిటివాడిగా న‌టిస్తున్నాడ‌ని, తొలిసారి డీ గ్లామ‌ర్ పాత్ర పోషిస్తున్నాడ‌ని, స‌మంత కూడా సేమ్ టూ సేమ్ అని బోల్డంత ప్ర‌చారం జ‌రిగింది. సుకుమార్ ఏదో కొత్త‌గా ట్రై చేసే ప‌నిలో ఉన్నాడ‌ని, ఈ సినిమాని క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని చిత్ర‌సీమ కూడా ఫిక్స‌య్యింది. కాక‌పోతే… ఈ సినిమా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ మాస్ మ‌సాలా! ఈ విష‌యంలో డౌటేం లేదు. ప్రయోగాత్మ‌క సినిమా చూద్దామ‌నుకొని థియేట‌ర్లో అడుగుపెడుతున్న ఆడియ‌న్‌కి సుక్కు షాక్ ఇవ్వ‌బోతున్నాడు. ఈ సినిమాలో.. ఏ కోణంలోనూ సుకుమార్ క‌మర్షియ‌ల్ ట‌చ్ మిస్స‌వ్వ‌లేదు. ఆఖ‌రికి ఐటెమ్ గీతంతో సహా.

సుక్కు ఐటెమ్ గీతాల స్పెష‌లిస్టు. అయితే వ‌న్‌, నాన్న‌కు ప్రేమ‌తో సినిమాల్లో ఆ ఛాన్స్ రాలేదు. ఆ లోటు తీర్చుకునేలా రంగ‌స్థ‌లంలో ఓ మాంఛి ఐటెమ్ గీతాన్ని పెట్టాడు. రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌రైజేష‌న్‌, రంగ‌స్థ‌లం అనే ప‌ల్లెటూరి మ‌నుషులు, వాళ్ల పాత్ర తీరుతెన్నులు ఇవ‌న్నీ పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ పంథాలో సాగుతాయ‌ని తెలుస్తోంది. గోదావ‌రి తీరంలో పుట్టిన పెరిగిన సుకుమార్‌, అక్క‌డి క‌థ‌ని, ఆ యాస‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ వాడుకోలేదు. గోదావ‌రి ఎట‌కారాన్ని ఈ సినిమాలో పూర్తి స్థాయిలో చూపించ‌బోతున్నాడు సుకుమార్‌. ఇలా అన్ని విభాగాల్లోనూ క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇస్తూ.. ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఎలాంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా థియేట‌ర్లో అడుగుపెట్టేవాడికి ఇన్ని హంగులు చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వ‌డం ఖాయం క‌దా?? సుకుమార్ లాజిక్ కూడా అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.