ఏపీలో పన్నుల మోత..! నాటి ఆవేశం ఇప్పుడేమయింది..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరోసారి పెట్రో వాత పెట్టింది. వ్యాట్ పెంచింది. లీటరు పెట్రోలుపై రూ.1.24, లీటరు డీజిల్‌పై 97 పైసలు అదనపు వ్యాట్‌ పెంచారు. అర్థరాత్రి నుంచే అమల్లోకి తెచ్చి వసూలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఒక లీటరు పెట్రోలుపై ప్రభుత్వం 31శాతం వ్యాట్‌, రూ.2.76 అదనపు వ్యాట్‌ వసూలు చేస్తోంది. ఇప్పుడు అదనపు వ్యాట్‌ను ఒకేసారి రూ.4 చేసింది. డీజిల్‌పై 22.25శాతం వ్యాట్‌, రూ.3.07 అదనపు వ్యాట్‌ విధిస్తోంది. ఇప్పుడు ఈ వ్యాట్‌ను పెట్రోల్‌తో సమానంగా రూ.4 చేసింది. అంటే.. కేంద్ర రాష్ట్ర పన్నులు పోను.. అదనంగా.. ఒక్కో లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై ఏపీ సర్కార్ రూ. 4 అదనంగా వసూలు చేస్తోందన్నమాట.

పెట్రో మంటల్లో కేంద్రానికి తోడు రాష్ట్రం వాటా..!

కేంద్ర ప్రభుత్వం దేశానికి రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర ప్యాకేజీ ప్రకటించింది. దీన్ని అమలు చేయడానికి నిధులను పెట్రో చార్జీల వడ్డన ద్వారానే సమీకరిస్తోంది. దాదాపుగా ఇరవై రోజుల పాటు.. పెంచుతూ… లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై.. రూ. పదికిపైనే వడ్డించింది. దానికి తగ్గట్లుగా రాష్ట్ర పన్నులు కూడా పెరిగాయి. అంతిమంగా.. పెట్రోల్ రేటు రూ. 85 దాటిపోయింది. డీజిల్ రేటు కూడా అదే స్థాయికి వచ్చింది. ఇప్పుడు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పిండుకోవాలని నిర్ణయించించింది. దానికి కారణంగా.. ప్రభుత్వానికి ఆదాయం పడిపోవడం చెబుతోంది. పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తున్నామని వివరిస్తోంది.

ప్రజల ఆదాయం పడిపోయినా పన్నుల పెంపు..!

కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయిందంటే.. దాని అర్థం ప్రజల ఆదాయం పడిపోవడమే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ కుటుంబానికీ పూర్తి స్థాయిలో ఆదాయం లేదు. ఉపాధి కరవయింది. ఓ వైపు కరోనా కేసులు విజృంభిస్తూంటే.. మరో వైపు ప్రభుత్వ నిర్వాకాల కారణంగా.. నిర్మాణ రంగం కూడా కుదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థలు కూడా.. కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఓ రకంగా.. ప్రజల ఆదాయం.. 60 నుంచి 70 శాతం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రభుత్వం.. పన్నులు పెంచే ఆలోచన చేయకూడదు. కానీ ఆదాయం పడిపోయినప్పటికీ.. పన్నులు పెంచి.. తమ ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనకు అటు కేంద్రంతో పాటు.. ఇటు ఏపీ కూడా వచ్చింది.

ప్రతిపక్ష నేతగా ఆవేశపడి… సీఎంగా అదే చేస్తున్న జగన్..!

నిజానికి రాష్ట్ర విభజన సమయంలో.. ఏపీకి ఆదాయం తక్కువగా ఉండటంతో.. చంద్రబాబు ప్రభుత్వం పన్నులు వడ్డించింది. ఆ సమయంలో.. దేశం మొత్తం మీద ఏపీలోనే ఎక్కువగా పెట్రోల్ , డీజిల్ చార్జీలు ఉండేవి. అయితే.. లీటర్‌కు రూ. 70 దగ్గరే ఉండేది. ఆ తర్వాత చంద్రబాబు… రూ. రెండు వ్యాట్ తగ్గించారు. దాంతో.. ప్రజలకు కాస్త రిలీఫ్ వచ్చినట్లయింది. పన్నులుఎక్కువగా ఉన్న సమయంలో.. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి.. చాలా ఆవేశంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలను దోపిడీ చేస్తున్నారని.. మండిపడేవారు. ఇప్పుడు.. చంద్రబాబు తగ్గించిన టాక్స్‌ను కూడా జగన్ పెంచేశారు. దాంతో.. ఆ ఆవేశం ఏమయిందనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close