`సెస్’ లేకుండా `స్వచ్ఛ్’ నడపలేరా ?

పొద్దున్నే నిద్రలేచేసరికి మొబైల్ ఫోన్ లో మెసేజ్ రెడీగా ఉంది. ఏమిటా అని చూస్తే, అందులో భారత ప్రభుత్వం ఆదేశాలమేరకు స్వచ్ఛ్ భారత్ కోసం సెస్ క్రింద 0.5 శాతం చార్జ్ చేయబడుతుంది. ఇది, మీరు చెల్లించే సర్వీస్ చార్జ్ 14 శాతానికి అదనమని గ్రహించగలరు. నవంబర్ 15 తర్వాత సిద్ధంచేసే బిల్లల్లో ఈ సెస్ కలపబడుతుంది- అని ఉంది.

ప్రతి వంద రూపాయలకు కేవలం 50 పైసలు మాత్రమే ఈ స్వచ్ఛ్ భారత్ క్రింద సెస్ గా కలెక్ట్ చేస్తారు. పైకి చూసినప్పుడు ఇది చాలా స్వల్పమే. అయితే పన్ను చెల్లించే అన్ని సేవలకు ఇది వర్తించడంతో చినుకుచినుకు కలుపుకుంటూ పోయినట్లవుతుంది. సేవాపన్ను మనం చాలాసేవలకు చెల్సిస్తుంటాము. ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ కావచ్చు, ఏటీఎం ఆపరేషన్స్ కావచ్చు, బ్యూటీ ట్రీట్ మెంట్ , క్యాబ్ సేవలు, పెట్రోల్, ఇంటర్నెట్- టెలికమ్యూనికేషన్ సేవలు ఇలా ఈ లిస్ట్ చాంతాడంత ఉంది. వందకు 50 పైసల చిలక్కొట్టుడు లెక్కన చూస్తే, మనం నిత్యం కడుతున్న సేవాపన్నులకు ఈ సెస్ తోడైతే కాస్తోకూస్తో అదనపు భారంగానే మారుతుంది. ఒక మంచిపనికి ఆమాత్రం ఇవ్వలేమా- అన్న ఉపశమన వ్యాఖ్యలకంటే, అసలు ఆ స్వల్పమాత్రపు సెస్ వసూలుచేయకుండా స్వచ్ఛ్ భారత్ ఉద్యమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదా అని ప్రశ్నించుకోవాలి. దీనికి పాలకులు సమాధానం చెప్పాలి. అనేక రూపాల్లో మనం చెల్లించే పన్నుల వల్లనే ఎన్నో ప్రజాప్రయోజన పథకాలు అమలవుతున్నాయి. వాటిలోనే దీన్ని కూడా మిళితం చేయవచ్చు. అంతేకానీ ప్రత్యేకంగా ఈ గిల్లుళ్లు, గిచ్చుళ్లు దేనికో… చిత్రమేమంటే ఈ గిల్లుడు ఆలోచన ఒక తెలుగు నాయకునికి రావడం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా ఉత్సాహంగా స్వచ్ఛ్ భారత్ ను ఘనంగా క్రిందటేడాది ప్రారంభించారు. అప్పట్లో పెద్దపెద్ద నాయకులు, సెలబ్రెటీలు చీపుర్లూ గట్రా పట్టుకుని వీధులును శుభ్రంచేసి పోటోలు, వీడియోలు తీయించుకుని చేతులుదులుపుకున్నారు. 2015 అక్టోబర్ 2తో ఏడాది ముగిసింది. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇదిగో ఈ ఆర్భాట ప్రచారం తప్ప ఏమీ కనిపించలేదు. రాష్ట్రాలకు రాష్ట్రాలనే దత్తతు తీసుకునే ఆర్థిక దమ్మున్న మహాకోటీశ్వరులకు కరణుకలగలేదు. చివరకు ప్రజలిచ్చే పైసాపైసా సొమ్ముతోనే దీన్ని ముందుకు నడిపించాలన్నది ఏలినవారి ఉద్దేశం.

గ్రామాల్లో పారిశుధ్యం గురించి మహాత్మా గాంధీ తరచూ మాట్లాడేవారు. టాయిలెట్స్ ని డ్రాయింగ్ రూముల్లా శుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రచారం చేశారాయన. శబర్మతి ఆశ్రమంలో ఆయనే స్వయంగా టాయిలెట్ ని నిర్మించారు. ఎక్కడకు వెళ్ళినా తాను వాడిన మరుగుదొడ్డిని ఆయనే శుభ్రంచేసేవారు. గాంధీజీ ఆశయాలతో ప్రభావితమైన మోదీ స్వచ్ఛ్ భారత్ ప్రవేశపెట్టారు. దేశమంతటా 80 లక్షల టాయిలెట్లు నిర్మించాలి. వాటిలో కనీస అవసరాలు (నీరు, విద్యుత్, పరిశుభ్రత) ఉండాలి. అయితే మొదటి ఏడాది అయ్యేసరికి తిరిగిచూస్తే, ఆశయానికి ఆమడదూరంలో ఉన్నాము.

మోదీ కాస్తంత కలవరపడ్డారు. ఇక లాభంలేదని ఒక సబ్ కమిటీ వేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షత వహించారు. వెంటనే బాబుగారు చాలా స్పీడ్ గా ఆలోచించారు. స్వచ్ఛ్ భారత్ బాగా అమల్లోకి రావాలంటే నిధులు సమకూర్చుకోవాలి. అందుకు పన్నులుచెల్లిస్తున్న అన్నిరకాల సర్వీసులపై 0.5శాతం సెస్ విధించాలని ప్రధానికి సూచనచేశారు. `భేష్..బాగున్నదం’టూ మోదీ తలఊచారు. నవంబర్ 15నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛ్ భారత్ సెస్ (0.5 శాతం) ప్రజలకు పెద్ద భారం కాదని కలరింగ్ ఇచ్చేశారు. ఓ మంచి పని చేపట్టినప్పుడు ఆమాత్రం ప్రజలు సహకారం అందించకపోతే ఎలా- అన్నట్లు మాట్లాడారు.

నూతన రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో చంద్రబాబు వినూత్నంగా ఇ-బ్రిక్స్ కొనుగోలుచేసే పథకం ప్రవేశపెట్టారు. ఇవ్వాళ్టికి (13-11-15) 46లక్షల 95వేల పైచిలుకు ఇటుకలు కలెక్ట్ చేయగలిగారు. ప్రతి ఇటుక రేటు 10 రూపాయలు మాత్రమే. ఇప్పుడిది ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిదంటే, నొప్పి తెలియకుండా జనం నుంచి సొమ్ము లాక్కుని ఖజానా నింపుకోవడం ఎలాగో చంద్రబాబుకు బాగా తెలుసన్నది చెప్పడానికే. అందుకేనేమో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుంటే, చంద్రబాబునే ఈ సబ్ కమిటీకి అధ్యక్షుణ్ణి చేశారు మోదీ.

ఇప్పుడు స్వచ్ఛ్ భారత్ `సెస్' చెల్లించేవారంతా ఇలాంటి పథకం ప్రవేశపెట్టమని ప్రధానమంత్రిని కోరలేదు. గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితమై మోదీనే ప్రవేశపెట్టారు. అయితే, మహాత్మాగాంధీ ఉండిఉంటే, ఇలా ప్రజల నుంచి సెస్సులూ గట్రా వసూలుచేసి శానిటేషన్ పనులు చేయమని చెప్పిఉండేవారుకారేమో. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకువస్తున్నాయి. వాటి అమలుకోసం సెస్ లాంటిదేమీ వసూలు చేయడంలేదు. అలాంటప్పుడు స్వచ్ఛ్ భారత్ కోసం ఎందుకీ తంట. ఖజానాలో డబ్బు ఉన్నదో లేదో చూసుకోకుండానే దేశమంతటా 80 లక్షల టాయిలెట్స్ నిర్మించాలనుకున్నారా? రోడ్లన్నింటినీ శుభ్రం చేయగలమని భావించారా ? లేదంటే ఫోటోలకు ఫోజులిచ్చిన సెలబ్రెటీస్ , సంపన్నులు తమ సంచీల్లోంచి డబ్బులు తీసి ఇస్తారని అనుకున్నారా? అసలు ఏమనుకుని ఈ పథకం ప్రవేశపెట్టారో మోదీ, ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము ఇలాగే, ఇదే అపరిశుభ్రత మధ్య జీవిస్తున్నాం. మమ్మల్ని ఉద్దరిస్తామని కంకణం కట్టుకున్నది మీరే. కనుక, దాని పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి. అంతేకానీ, మధ్యలో మా నుంచి ఇలా డబ్బు పిండుకోవడమేమిటి? దానికి చంద్రబాబులాంటి వాళ్లు నాయకత్వం వహించడమేమిటీ…?? ఓసారి ఆలోచించండి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close