టాక్‌తో పనేంటి?? డ‌బ్బులొచ్చాయ్ క‌దా!

అవును.. ఓ సినిమా జ‌యాప‌జ‌యాలు డ‌బ్బుల‌తోనే ముడి ప‌డి ఉంటాయి. సినిమా జ‌నాల‌కు న‌చ్చిందా, లేదా? అనేది కాదు.. పెట్టుబ‌డికీ రాబ‌డికీ తేడా ఎంత అనేదే సినిమా హిట్టూ, ఫ్లాపుల్ని నిర్ణ‌యిస్తాయి. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కేశ‌వ విమ‌ర్శ‌కుల‌కు న‌చ్చ‌లేదు. ఆడియ‌న్స్‌కీ అంతంత మాత్రంగా ఎక్కింది. కానీ నిర్మాత‌ల‌కు లాభాల్ని మిగిలిచ్చింది. ఈ చిత్ర నిర్మాత అభిషేక్ నామా ఓ తెలివైన ప‌నిచేశాడు. ద‌ర్శ‌కుడికి ఓ ఎమౌంట్ అప్ప‌జెప్పి, అందులోనే సినిమా తీసిపెట్ట‌మ‌న్నాడు. రూ.6.5 కోట్ల ప్యాకేజీతో సినిమా పూర్తి చేశాడు సుధీర్ వ‌ర్మ‌. పారితోషికాలు, మేకింగ్ అన్నీ అందులోనే. సినిమా పూర్త‌య్యాక ప‌బ్లిసిటీ మాత్రం అభిషేక్ నామానే చూసుకొన్నాడు. ఈ సినిమా విడుద‌లై.. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు రూ.10 కోట్ల‌కు పైగానే ఆర్జించింది. దానికి తోడు శాటిలైట్ గిట్టుబాటు అయ్యింది. అంటే.. ఈ ప్రాజెక్టుతో నిర్మాత‌కు క‌నీసం రూ.4 కోట్ల వ‌ర‌కూ లాభం వ‌చ్చింద‌న్న‌మాట‌.

చిన్న సినిమాకు ఈ స్థాయి లాభాలు వ‌చ్చాయంటే.. అది క‌చ్చితంగా నిఖిల్‌కున్న మార్కెట్టే. త‌న గ‌త సినిమాల‌న్నీ బాగా ఆడాయి. ఏబీసీ సెంట‌ర్ల‌తో ప‌ని లేకుండా మంచి లాభాల్ని సంపాదించాయి. ఆ ట్రాక్ రికార్డు చూసే ఈ సినిమాని బ‌య్య‌ర్లు మంచి రేట్ల‌కు కొన్నారు. ఓపెనింగ్స్ కూడా బాగా వ‌చ్చాయి. సో నిర్మాత గ‌ట్టెక్క‌డ‌మే కాదు, లాభాల‌తో నిల‌బ‌డ‌గిలాడు. మార్కెట్ స్ట్రాట‌జీని అర్థం చేసుకొని సినిమాలు తీస్తే.. లాభాలు రావ‌డం ఖాయం అని చెప్ప‌డానికి కేశ‌వ ఓ తాజా ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.