టీడీపీ లెక్క..బహిష్కరణే కానీ పోటీ కూడా..!

పరిషత్ ఎన్నికల విషయంలో టీడీపీ అధికారికంగా బహిష్కరించినప్పటికీ.., ఆ పార్టీ నేతలకు స్వేచ్చ ఇచ్చింది. ఇప్పటికే నామిషన్లు.. ఉపసంహరణలు కూడా పూర్తి కావడంతో టీడీపీ అభ్యర్థులు పోటీ ఉన్నట్లే. అందుకే గెలుపుపై ధీమా ఉన్న నేతలందరూ తమ ప్రయత్నాలు తాము చేసుకోవచ్చని అంతర్గత సందేశం పంపేసింది. దీంతో చాలా చోట్ల టీడీపీ నేతలు యధావిధిగా ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల జిల్లా స్థాయి నేతలు సీరియస్‌గా రంగంలోకి దిగారు. టీడీపీ వైదొలిగింది.. ఇక పరిషత్‌లన్నీ తమవేనని అనుకున్న వైసీపీ నేతలకు షాక్ తగిలిగింది. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో టీడీపీ నేతలు చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేకు షాక్ తగిలినట్లయింది. ఎందుకు ప్రచారం చేస్తున్నారని రాష్ట్రం మొత్తానికి ఓ న్యాయం.. కొడుకు నియోజకవర్గానికి ఓ న్యాయమా అంటూ ప్రశ్నించడం ప్రారంభించారు.

అయితే ఒక్క దుగ్గిరాలలో మాత్రమే కాదు.. టీడీపీ బలమైన పోటీ ఇచ్చే ప్రతీ చోటా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ నిర్ణయం బహిష్కరణే అయినా వారు వెనక్కి తగ్గడం లేదు. ఆసక్తి ఉన్న వారు సీరియస్‌గా ప్రయత్నించాలని అంతర్గత సందేశాలు కూడా రావడంతో పార్టీ నేతలు తగ్గడం లేదు. దీంతో వైసీపీ నేతలు టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్న అభిప్రాయానికి వచ్చారు. ఎన్నికలు బహిష్కరించినప్పటికీ.. తమకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వచ్చాయని అంటే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అర్థం అని ప్రచారం చేయడానికి టీడీపీ వ్యూహం పన్నిందని వైసీపీ భావిస్తోంది. టీడీపీ బహిష్కరణ నిర్ణయంతో వైసీపీ నేతలు పోల్ మేనేజ్ మెంట్ ఖర్చును తగ్గించుకుంటారు. డబ్బులు పంపిణీ చేయరు. ఇంత కాలం డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోతే ఆ అసంతృప్తి ఓటింగ్‌లో కనిపిస్తుంది. వారికి ఎందుకు ఓటు వేయాలన్న భావన ఓటర్లకు వస్తే.. అది తమకు లాభిస్తుందని టీడీపీ నేతలు అంచనాకు వచ్చారు.

వైసీపీ నేతలు కూడా ప్రస్తుతం టీడీపీ తీసుకున్న నిర్ణయం.. దాన్ని అమలు చేస్తున్న వైనంపై ఓ కన్నేసింది. బహిష్కరణ పేరుతో టీడీపీ గేమ్ ఆడుతోందని.. అనుమానిస్తోంది. తాము ఎన్నికలను లైట్ తీసుకునేలా చేసి… తాము అంతర్గతంగా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తోందన్న భావనకు వస్తున్నారు. ఎలాగూ.. సీరియస్‌గా ఎన్నికలు జరిగితే.. బెదిరింపులు.. ప్రలోభాలతో ఎక్కువ సీట్లు గెల్చుకుంటారు. అప్పుడు టీడీపీకి మ్యాండేట్ లేదన్న ప్రచారం జరుగుతుంది. అలా కాకుండా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే వచ్చే సీట్లన్నీ బోనస్. అసలేమీ రాకపోయినా బహిష్కరించామని చెప్పుకోవచ్చు. టీడీపీ ప్లాన్ వైసీపీకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ నేతలు పోల్ మేనేజ్ మెంట్‌ను సీరియస్‌గా చేయాలన్న సంకేతాలను పంపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close