డిసెంబ‌రు 11 నుంచి థియేట‌ర్ల ఓపెన్‌

సినీ అభిమానుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లో తెలంగాణ‌లోనూ థియేట‌ర్లు తెర‌చుకోబోతున్నాయి. అన్ లాక్ లో భాగంగా… థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడో అనుమ‌తులు ఇచ్చింది. అయితే కొన్ని మార్గ ద‌ర్శ‌కాల‌ను పాటించ‌మ‌ని ఆదేశించింది. థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు ఇవ్వాలో, లేదో.. రాష్ట్ర ప్ర‌భుత్వాలే తేల్చుకోవాల‌ని చెప్పింది. ఇప్ప‌టికే ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు ఇచ్చేసింది. అయితే స‌గం సీట్ల‌తో థియేట‌ర్ల‌ని న‌డిపించ‌డం క‌ష్టం కాబ‌ట్టి, తెలుగు సినిమా అనేది తెలంగాణ తోనూ ముడి ప‌డి ఉన్న అంశం కాబ‌ట్టి.. కొత్త సినిమాలేం విడుద‌ల కాలేదు.

ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం సైతం.. థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు ఇస్తూ ఓ జీవో జారీ చేసింది. డిసెంబ‌రు 11 నుంచి… థియేట‌ర్లు తెర‌చుకోవొచ్చు. అయితే… ఈ వార్త నిర్మాత‌ల్ని ఉత్సాహ‌ప‌ర‌చ‌డం లేదు. ఎందుకంటే… టికెట్లు స‌గం అమ్ముకోవాలో, పూర్తిగా అమ్ముకోవ‌డానికి అనుమ‌తులు ఇచ్చారో అన్న క్లారిటీ.. ఈ జీవోలో లేదు. డిసెంబ‌రు 11 నుంచి థియేట‌ర్లు ఓపెన్ అయినా.. కొత్త సినిమాలేం క‌నిపించ‌వు. ఇప్ప‌టికే ఓటీటీలోకి వ‌చ్చిన కొన్ని సినిమాల్ని ఇప్పుడు థియేట‌ర్ల‌లోనూ చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. కొన్ని మ‌ల్టీప్లెక్సులు ప్రేక్ష‌కుల్ని మ‌ళ్లీ థియేట‌ర్ల కు అల‌వాటు చేయ‌డానికి ఫ్రీ షోలు వేయ‌బోతున్నాయి. అలా.. డిసెంబ‌రులో కొత్త సినిమాల ఊసు లేక‌పోవొచ్చు. జ‌న‌వ‌రి తొలి వారం నుంచి.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త సినిమాల్ని చూసే అవ‌కాశం ఉంది. అయితే.. పూర్తి టికెట్లు అమ్ముకునే వెసులు బాటు క‌ల్పిస్తేనే. లేదంటే.. కొత్త సినిమాల రాక‌డ క‌ష్ట‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close