“విదేశీ కరోనా సాయం” అంతా ఎటు పోతోంది..!?

భారత్ దుస్థితి చూసి ప్రభుత్వం పెద్దగా చలించకపోయినా ప్రపంచంలోని ఇతర దేశాలు మాత్రం కన్నీరు పెట్టుకుని.. ప్రజల ప్రాణాల్ని కాపాడతామంటూ పెద్ద ఎత్తున సాయాన్ని పంపిస్తున్నాయి. అందులో ప్రజల ప్రాణాలను నిలిపే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దగ్గర్నుంచి మెడిసిన్స్ వరకూ అన్నీ ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇతర దేశాల నుంచి వస్తున్న చారిటీ ఫ్లైట్స్ పెద్ద ఎత్తున ల్యాండ్ అవుతున్నాయి. అన్ లోడ్ చేసి వెళ్లిపోతున్నాయి. కానీ.. అన్‌లోడ్ చేసిన ఆ సాయం అంతా.. కేంద్రం ఎలా సద్వినియోగం చేస్తుందో మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఆ సరకుంతా ఎక్కడ దాచి పెడుతున్నారో కానీ… అవసరమైన వారికి మాత్రం సరఫరా చేయడం లేదన్న క్లారిటీ మాత్రం మెల్లగా వస్తోంది.

విదేశాల నుంచి వస్తున్న మెడికల్ సామాగ్రిని … కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాలి. రాష్ట్రాలు మొత్తం కలిపితేనే కేంద్రం. కేంద్రానికి సంబంధించిన ఆస్పత్రులు రాష్ట్రాల్లో ఉంటే.. అవి ఎయిమ్స్ లేకపోతే.. ఈఎస్‌ఐ లాంటి అతి కొద్ది మాత్రమే ఉంటాయి. వాటికి అయినా విదేశాల నుంచి సాయం రూపంలో వస్తున్న మెడికల్ సామాగ్రి పంపిణీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా ఇస్తారు. అయితే ఇప్పటి వరకూ ఏ రాష్ట్రానికీ ఇచ్చినట్లుగా లేదు. ఢిల్లీ నుంచి సాయం తీసుకుని ఇతర రాష్ట్రాలకు ఫ్లైట్లు ఎగిరినట్లుగా కూడా రికార్డుల్లో లేదు. దీంతో.. ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

ఆక్సిజన్ కొరత కారణం కావొచ్చు.. ఆక్సిజన్ అందించే పరికరాల కొరత కారణం కావొచ్చు.. దేశంలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఆక్సిజన్ కొరతతో చనిపోతున్న వారి వార్తలే కనిపిస్తున్నాయి. ఒక్క ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఉన్నా.. పదుల సంఖ్యలో ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఎలాగూ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి.. కనీసం విదేశాల నుంచి సాయంగా వస్తున్న వాటినైనా.. రాష్ట్రాలకు పంపి.. ఆక్సిజన్ మరణాలను తగ్గించే ప్రయత్నాలు చేయకపోవడంపై… విస్మయం వ్యక్తమవుతోంది. ఇలాంటి విషయాలను చెప్పిన మీడియాపై కక్ష సాధింపులకు దిగుతున్నారు కానీ.. దాని వల్ల ప్రజల ప్రాణాలు నిలబడవన్న నిజాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close