లోకేష్ విష‌యంలో ప‌వ‌న్ కి ఎందుకంత టెన్ష‌న్‌..!

ఏపీ మంత్రి నారా లోకేష్ పై మ‌రోసారి కొన్ని విమ‌ర్శ‌లు చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. స్వ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని జ‌న‌సేన కార్యాల‌యంలో ఆయ‌న జెండా ఎగ‌రేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల్లో ఉంటూ, ప్ర‌జ‌ల క‌ష్టాల‌కు స్పందించేవారే రాజ‌కీయాల్లోకి రావాల‌న్నారు. రాజ‌కీయాల్లో జ‌వాబుదారీత‌నం పెర‌గాల‌ని ఆకాంక్షించారు. ఏపీకి ముఖ్య‌మంత్రి అవ‌డానికి మంత్రి నారా లోకేష్ కి ఉన్న అనుభ‌వం ఏంట‌ని ప్ర‌శ్నించారు? అంతేకాదు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తో పోల్చుతూ… ఆయ‌నకి ఉద్య‌మంలో పాల్గొన్న అనుభ‌వం ఉంద‌నీ, ప్ర‌జ‌ల్లోంచి గెలిచి రాజకీయాల్లోకి వ‌చ్చార‌న్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కి అలాంటి అనుభ‌వం ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు. రెండ్రోజుల కింద‌ట కూడా ఇలానే నారా లోకేష్ మీద ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న‌కి ముఖ్య‌మంత్రి అయ్యేందుకు ఉన్న అర్హ‌త‌లు ఏంటంటూ ప్ర‌శ్నించారు.

నిజానికి, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నారా లోకేష్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఉంటార‌నే చ‌ర్చ తెలుగుదేశంలో కూడా లేదు..! 2019లోనే లోకేష్ ని ముఖ్య‌మంత్రిని చేసేద్దామ‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు కూడా ఆరాట‌ప‌డుతున్న దాఖ‌లాలు లేవు. విభ‌జ‌న త‌ర‌వాత‌, ఇప్పుడిప్పుడే రాష్ట్రం సొంత కాళ్ల‌పై నిల‌బ‌డే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇంకోప‌క్క‌, కేంద్రం నుంచి స‌హ‌కారం సున్నా! ఇలాంటి, నేప‌థ్యంలో కేంద్రంతో ధీటుగా పోరాడే నాయ‌కుడి నాయ‌క‌త్వం రాష్ట్రానికి మ‌రో ఐదేళ్లపాటు అవ‌స‌రం అనే చ‌ర్చే ఏపీలో జ‌రుగుతోంది. అంతేత‌ప్ప‌… ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థుల‌పై ఫోక‌స్ లేదు. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణే ప‌దేప‌దే మాట్లాడుతున్నారు, అంతే!

మంత్రి కేటీఆర్ తో నారా లోకేష్ ని పోల్చి మాట్లాడ‌టం విష‌యానికొస్తే… కేటీఆర్ కి ఉన్న‌ట్టుగా లోకేష్ కి ఉద్య‌మాల్లో పాల్గొన్న అనుభ‌వం ఎక్క‌డిదీ అని ప్ర‌శ్నించారు? అంద‌రికీ ఉద్య‌మాల్లో పాల్గొన్న నేప‌థ్య‌మే కావాలంటే ఎలా..? మ‌రి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ ఉద్య‌మ నేప‌థ్యంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు? ఆయన నడిపిన, లేదా పాల్గొన్న ఉద్యమాలు ఏమున్నాయి..? ఇప్పుడు ఆయ‌న కూడా సీఎం అభ్య‌ర్థే క‌దా! పోనీ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం అవుతార‌నే చ‌ర్చ తెలంగాణ‌లో ఉంది, క‌నీసం ఏపీలో లోకేష్ విష‌యంలో అలాంటి చర్చ ఎక్క‌డుంది..? అనుభ‌వం కావాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణే చెబుతున్నారు కదా. ఇప్ప‌టికిప్పుడు లోకేష్ కూడా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థే అనే చ‌ర్చ ఏదైనా ఉంటే… ప‌వ‌న్ విమ‌ర్శ‌లు కొంత స‌మంజ‌సంగా ఉండేవి! లోకేష్ కొన్నాళ్లు పార్టీ బాధ్య‌త‌లు చూశారు. ఇప్పుడు మంత్రిగా త‌న ప‌రిధిలోని శాఖ‌ల్లో విజ‌యాలు సాధించే దిశ‌గా ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన్ని ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌డ‌మే అనుభ‌వం అని చెప్పుకుంటున్న‌ప్పుడు… ఒక రాజ‌కీయ పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు పంచుకోవ‌డం, మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా అనుభ‌వం కింద‌నే లెక్క‌గ‌ట్టాలి క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close