శ్వేత : చిన్నమ్మా..! ఇప్పుడు.. ఎన్టీఆర్ ఆత్మ ఆనంద తాండవం చేస్తోందా..?

  • దగ్గుబాటి పురందేశ్వరి – బీజేపీ
  • దగ్గబాటి వెంకటేశ్వరరావు – కాంగ్రెస్
  • దగ్గుబాటి హితేష్ చెంచురామ్ – వైసీపీ

కాంబినేషన్.. సూపర్ మ్యాచ్ అయిపోయింది. ఇంత వరకూ భార్య, భర్తలు మాత్రమే వేర్వేరు పార్టీల్లో ఉండటం చూశాం. కానీ ఎన్టీఆర్ బిడ్డ పురందేశ్వరి కుటుంబం మాత్రం మూడు పార్టీల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి దూరమైన తర్వాత వారు .. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్లు కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ బిడ్డ అన్న గౌరవానికి ప్రజలు లోటు రానీయలేదు. బాపట్లలో పోటీ చేసినా గెలిపించారు.. విశాఖలో పోటీ చేసినా గెలిపించారు. రాజకీయ జీవితం ఇచ్చారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు…?

“ఎన్టీఆర్ ఆత్మగౌరవం” పై బాధంతా మాటల్లోనేనా చిన్నమ్మా..?

తెలుగుదేశం పార్టీ .. తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి మహాకూటమిలో భాగంగా ఏర్పడినప్పుడు… చిన్నమ్మ.. తన తండ్రి ఆత్మ క్షోభిస్తుందని.. తెగ ఆవేశ పడ్డారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పార్టీ పెట్టారని.. ఇప్పుడా పార్టీతో చేతులు కలపడం ఏమిటనేది ఆమె అబ్జెక్షన్. ఎన్టీఆర్ కుమార్తెగా.. చెబుతోంది కాబట్టి.. దాని విలువ ఉండాలంటే.. అదే కాంగ్రెస్ పార్టీకి ఆమె దూరంగా ఉండాలి కదా..! కానీ భర్తతో కలిసి.. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి.. కేంద్రమంత్రి వంటి ఉన్నతమైన పదవుల్ని పదేళ్ల పాటు అనుభవించారు. ఆ పార్టీ నిర్వీర్యమయ్యే సరికి .. ఎన్నికల కంటే ముందే బీజేపీలో చేరిపోయారు. అదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. మాత్రం.. కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడూ అదే మాట మీద ఉన్నారు. కానీ కుమారుడ్ని తీసుకెళ్లి.. దగ్గరుడ్నించి .. వైసీపీలో చేర్పించారు. దానికి పురందేశ్వరి ఆశీస్సులు లభించాయి. అంటే.. ఎన్టీఆర్ బిడ్డ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు మూడు పార్టీల్లో ఉన్నారు. ఇది ఎన్టీఆర్ ఆత్మగౌరవం కాపాడటమా చిన్నమ్మా..?

ఇప్పుడు “అన్న ఆత్మగౌరవం” హ్యాపీగా ఉంటుందా..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి… పురందేశ్వరి తండ్రి.. ఎన్టీఆర్ ను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు.. ఎంత దారుణంగా అవమానించేవారో అప్పటి తరానికి బాగా తెలుసు. వైఎస్ చేసిన ఫ్యాక్షన్ తరహా రాజకీయాలతో ఆయన పడిన ఇబ్బందులూ అందరికీ తెలుసు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా ఉన్నప్పిటకీ… మిమ్మల్ని ఎలా నియంత్రిచాలని చూశారో.. అందరికీ తెలుసు. మీకు టిక్కెట్లు ఖరారు చేయకుండా.. ఎన్ని విధాలుగా అడ్డుపడ్డారో అందరికీ తెలుసు. అయినప్పటికీ. సోనియా గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాల మేరకు టిక్కెట్లు తెచ్చుకోగలిగారు. అంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ… మళ్లీ వైఎస్ కుమారుని కుటుంబంలోకి వారసుడ్ని పంపించి… అన్న ఆత్మగౌరవానికి మరింత ఆనందం కలిగించావా చిన్నమ్మా..?

ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత ఇంక లేదు చిన్నమ్మా..?

ఎన్టీఆర్.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అనేది.. అప్పట్లో… ఢిల్లీలో అహంకారాన్ని ప్రదర్శిస్తూ.. రాజ్యాధికారం చేస్తోంది. ఆ అహంకారంపై పోరాటం చేశారు. ఆ స్థానంలో ఇప్పుడు బీజేపీ ఉంది. ఒక వేళ.. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టకపోయి.. భౌతికంగా జీవించి ఉంటే.. కచ్చితంగా ఈనాడు బీజే్పీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఉండేవారు. ఆంధ్రులను బీజేపీ అంతగా మోసం చేస్తోంది. అవమానిస్తోంది. వంచిస్తోంది. అలాంటి పార్టీలో ఉండి.. అతని వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే.. ఎవరికైనా రాజకీయ భవిష్యత్ ముఖ్యమే. కూతురిగా అంతకంటే ముందే.. తండ్రి గౌరవాన్ని కూడా కాపాడటం బాధ్యత. కాంగ్రెస్ లో ఉన్నా.. బీజేపీలో ఉన్నా… తెలుగుగు వారి కోసం… తెలుగు రాష్ట్రాల కోసం పోరాడితే.. తండ్రి ఆత్మ కూడా కూడా హర్షిస్తుంది. కానీ.. ముగ్గురు కుటుంబసభ్యులు.. మూడుపార్టీల్లో ఉండి.. తండ్రి పెట్టిన పార్టీపై.. విమర్శలు చేయడం… సహజంగా అన్నగారి అభిమానుల్ని బాధిస్తుంది. ఇక నుంచి అన్నగారు పేరు ఉపయోగించుకుని విమర్శలు చేస్తే సహజంగా… అది మిమ్మల్ని చిన్న బుచ్చుతుంది. తెలుకుంటావా చిన్నమ్మ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close