వైసీపీని “చెత్త కుప్ప”ల్లోకి చేర్చిన అంబటి రాంబాబు !

ఎన్నికల ప్రచారం చేయాలంటే ఓ ఆలోచన ఉండాలి. కానీ ఆ ఆలోచన వింతగా ఉంటే మాత్రం రివర్స్ అవుతుంది. దానికి అంబటి రాంబాబే సాక్ష్యం. ఇప్పుడు సత్తెనపల్లిలో ఎక్కడ చూసినా చెత్త కుప్పల్లో వైసీపీ బొమ్మలు.. జగన్, అంబటి రాంబాబు బొమ్మలు ఉన్న టీ కప్పులు కుప్పలు, తెప్పలుగా కనిపిస్తున్నాయి. వాటిని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. సరైన ప్లేస్ కే చేరాయని సెటైర్లు వేసుకుంటున్నారు. దీనికి కారణం ఎవరంటే అంబటి రాంబాబే.

వైసీపీ గురించి అందరూ మాట్లాడుకోవాలంటే చీప్ గా అయిపోయే ఓ ఐడియా టీ కప్పుల్ని పంచడం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. సత్తెనపల్లిలోని ప్రతి టీ దుకాణానికి టీ కప్పుల సంచులు ఇచ్చారు. వాటినే వాడాలని ఆదేశించారు. మామూలుగా టీ కప్పులు కొనాలంటే ఎంతో కొంత ఖర్చవుతుంది. ఆ డబ్బులు మిగులుతాయని వారు కూడా అంగీకరించారు. ఒక వేళ వద్దు అంటే… తట్టుకోవడం కష్టం. టీ బంకులు ఎక్కువగా రోడ్ల మీదనే ఉంటాయి.

అయితే తర్వాత జరిగే పరిణామాల్ని ఊహించలేకపోయారు అంబటి రాంబాబు. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తబుట్టలో టీ కప్పులే కనిపిస్తున్నాయి. తప్పల్లో వాటిపై కుక్కలు.. మనుషులు.. చేయకూడని పనులు చేస్తున్నారు. ఏదో చేద్దామనుకుంటే.. ఏదో అయిపోయిందే అని వైసీపీ నేతలు బాధపడుతున్నారు. అంతేనా ఇప్పుడు ఆ కప్పులు పంచడం రూల్స్ ఉల్లంఘన అని టీడీపీ నేతలు ఈసీకీ ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ కేసు కూడా నమోదైతే… అంబటి రాంబాబుకు.. వ్రతం చెడుతుంది.. కేసు పడుతుందన్నట్లుగా పరిస్థితి మారుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close