యూట్యూబ్ చానల్స్‌తో వైసీపీ ఫేక్ న్యూస్ రాజకీయం !

ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీలో చేరడానికి తాడేపల్లికి వెళ్లారోచ్ అని.. ఓ యూట్యూబ్ చానల్ బ్రేకింగ్ వేసేసింది. ఆ సమయంలో ప్రత్తిపాటి పుల్లారావు చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఓ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ విషయం ఎక్కువ మందికి తెలియదు. కానీ ఈ న్యూస్‌ను వేసిన యూట్యూబ్ చానల్.. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు ఇచ్చి మరీ వైరల్ చేసింది. వైసీపీ నేతలు దాని కోసమే రెడీగా ఉన్నారు. ఇక ఇటీవల నియమితులైన జిల్లా కన్వీనర్లు… కో కన్వీనర్లు ప్రత్తిపాటి వైసీపీలో చేరిపోయాడని చెప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు.

ప్రచారం చేసినంత సేపు చేసుకున్నారు కానీ చివరికి ప్రత్తిపాటి గాలి తీసేశారు. దాంతో వైసీపీతో పాటు ఆ చానల్ పరువు కూడా పోయినట్లయింది. తమ సర్వేల్లో తేడా వచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీలో ఉన్న బలమైన నాయకుల్ని లాక్కునేందుకు ఇలా వైసీపీ నేతలు.. ఐ ప్యాక్ టీంతో కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి చాలా మంది సీనియర్లను చంద్రబాబు ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేయడం .. వారికి కూడా కాస్త ప్లస్ అయ్యేలా ఉంది.

గతంలో కళా వెంకటరావు గురించి అలాగే రాశారు. నిన్న ప్రత్తిపాటి పుల్లావు.. రేపు మరొకరు. ఎవరైనా వైసీపీలో చేరుతారో లేదో తెలియదు కానీ.. వైసీపీ నేతలు మాత్రం.. . మా పార్టీలోకి వచ్చేస్తారంటూ ప్రచారం చేయించేసుకుంటున్నారు. నిజంగానే ఆ సీనియర్లు వచ్చి చేరినా టీడీపీకి పోయేదేమీ ఉండదు.. పైగా వారిని చేర్చుకుని వైసీపీనే సర్దుబాటు చేసుకోలేక తంటాలు పడాలని టీడీపీ నేతలంటున్నారు. అయితే ఆ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న యూ ట్యూబ్ చానళ్లను వదిలేసి లేదని.. ఒక్క సారి సీన్ మారగానే సినిమా చూపిస్తామని టీడీపీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close