శ్రీ‌రెడ్డి ధ‌ర్నా.. ఈ సారి ఎక్క‌డ‌?

ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు శ్రీ‌రెడ్డి చేసిన 5 నిమిషాల ధ‌ర్నాకే… టాలీవుడ్ మొత్తం అట్టుడికిపోయింది. ఆ త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాలేంటో మ‌న‌కు తెలిసిందే. అయితే… గ‌త కొన్ని రోజుల నుంచీ శ్రీ‌రెడ్డి కామ్‌గా ఉంది. ఆమె నుంచి క‌నీసం ట్వీట్లు కూడా లేవు. టీవీ ఛాన‌ళ్లు కూడా ఆమెను ప‌ట్టించుకోవ‌డం మానేశాయి. దాంతో.. మ‌రోసారి శ్రీ‌రెడ్డి మీడియా దృష్టిని ఆకర్షించాల‌ని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ‌రోసారి శ్రీ‌రెడ్డి ధ‌ర్నాకు దిగ‌బోతోంద‌ని టాక్‌. ఈసారి రామానాయుడు స్టూడియో ముందు త‌న నిర‌స‌న తెలియ‌జేయాల‌నుకుంటోంద‌ట‌. నిజానికి అస‌లు గొడ‌వ అంతా అక్క‌డి నుంచే మొద‌లైంది. సురేష్‌బాబు త‌న‌యుడు అభిరామ్‌ని టార్గెట్ చేస్తూ.. శ్రీ‌రెడ్డి పెట్టిన పోస్టులే ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. అయితే గొడ‌వ ఇటు నుంచి ఎటో వెళ్లిపోయింది. దాంతో అభిరామ్ ఎపిసోడ్ మ‌ర్చిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ శ్రీ‌రెడ్డి అక్క‌డి నుంచి ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌బోతోంద‌న్న‌మాట‌. శ్రీ‌రెడ్డి లిస్టులో రామానాయుడు స్టూడియోనే కాదు, మరో ద‌ర్శ‌కుడి ఇల్లు కూడా ఉంద‌ట‌. శ్రీ‌రెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న వారిలో ఓ అగ్ర ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడు. ఇటీవ‌ల ఓ వీడియో విడుద‌ల చేసి శ్రీ‌రెడ్డితో త‌న‌కు ఎలాంటి సంబంధ‌మూ లేద‌ని క్లారిటీ ఇచ్చాడు. ఆ ద‌ర్శ‌కుడ్ని కూడా శ్రీ‌రెడ్డి టార్గెట్ చేసుకున్న‌ట్టు స‌మాచారం. రామానాయుడు స్టూడియోలో ప్ర‌స్తుతం పోలీసుల గ‌స్తీ ఎక్కువైంది. ఈ ద‌ర్శ‌కుడి ఇంటి ముందు కూడా పోలీసులు సెక్యురిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రో వారం రోజుల పాటు మీడియాకి ఆహారం దొరికిన‌ట్టే..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close