యూపీలో రంగంలోకి ఐటీ.. ఈడీ, సీబీఐ కోసం వెయిటింగన్న అఖిలేష్ !

భారతీయ జనతా పార్టీకి అత్యంత విశ్వసనీయ మిత్రపక్షాలు ఏమిటి అనే ప్రశ్న వస్తే రాజకీయ పరంగా ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే బీజేపీని నమ్ముతున్న పార్టీలేవీ ఇప్పుడు లేవు. కానీ బీజేపీని వ్యతిరేకించే పార్టీల వద్ద మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం ఉంటుంది.. అదే ఐటీ, ఈడీ, సీబీఐ. ఈ మూడు దర్యాప్తు సంస్థలు బీజేపీ అధికారం చేపట్టిన దగ్గర్నుంచి ఎవరు బీజేపీని వ్య.తిరేకిస్తారో వారిని టార్గెట్ చేయడం.. వారు బీజేపీకి అనుకూలం అయితే సైలెంటయిపోవడం జరుగుతోంది. కొన్ని వందల మంది నేతలు ఈ మూడు దర్యాప్తు సంస్థల కేసుల బాధలు పడలేకే బీజేపీలో చేరిపోయారు. ఎన్నికలు వస్తున్నాంటే ఆ రాష్ట్రాల్లోనూ ఈ మూడు సంస్థల కదలికలు ఎక్కువగా ఉంటాయి.

బెంగాల్‌లో ఎన్నికలకు ముందు ఎంత రచ్చ చేశారో అందరూ చూశారు. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. యూపీలో బీజేపీకి దడ పుట్టిస్తున్న అఖిలేష్‌ను టార్గెట్ చేసుకుని ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్, ఆర్‌సీఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్‌ , లక్నో జైనేంద్ర యాదవ్ నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీరంతా అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితులే. ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి వీరంతా ఆర్థికంగా అండదండలు అందించే అవకాశం ఉందన్న ప్రచారం ఉన్న వారే.

ఈ దాడులపై అఖిలేష్ యాదవ్ భిన్నంగా స్పందించారు. ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను బీజేపీ ఉపయోగించుకుంటోందని.. ఇప్పుడు ఐటీ అధికారులు మాత్రమే వచ్చారు.. ఇక ముందు ఈడీ, సీబీఐ అధికారులు కూడా వస్తారని.. వారి కోసం వెయిట్ చేస్తున్నామని సెటైర్లు వేశారు. దేనికీ తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీ దర్యాప్తు సంస్థలను అత్యంత దారుణంగా రాజకీయాల కోసం వాడుకుంటుందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అది శ్రుతి మించితే దాడులకు గురైన వారికే ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close