విజ‌య్‌కాంత్‌ని చంపేశారంటున్న ద‌ర్శ‌కుడు

త‌మిళ స్టార్ విజయకాంత్ మరణం ఆయ‌న అభిమానుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మ‌రోవైపు విజ‌య్‌కాంత్ ది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, ఆయ‌న్ని ఎవ‌రో హ‌త్య చేశార‌ని మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఆరోపించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఇలాంటి ఆరోప‌ణ‌లు ఏ రాజ‌కీయ నాయ‌కులో, విజ‌య్ కాంత్ అభిమానులో చేస్తే పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. పుత్రేన్ లాంటి ద‌ర్శ‌కుడు ఇలా మాట్లాడ‌డం త‌మిళ నాట చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ని ట్యాగ్ చేస్తూ ఓ పెద్ద పోస్ట్ పెట్టారు పుత్రేన్‌.

”ఉదయనిధి స్టాలిన్ అన్నా… కేరళ నుంచి చెన్నై వచ్చిన నేను, రెడ్ జెయింట్ ఆఫీసులో కూర్చుని ‘మీరు రాజకీయాలలోకి రావాలి’ అని చెప్పాను. క‌రుణానిధిని ఎవరు మర్డర్ చేశారో, ఐరన్ లేడీ జయలలితను మర్డర్ చేసింది ఎవరో మీరు కనిపెట్టాలని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్ ను ఎవరు హత్య చేశారో కనిపెట్టాలి. వాళ్ళను పట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ విషయాన్ని విస్మరిస్తే… ‘ఇండియన్ 2’ సెట్స్‌లో కమల్ హాసన్ గారిని, మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు“ అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. విజ‌య్ కాంత్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ఓ ద‌శ‌లో ఆయన చ‌నిపోయాన్న వార్త‌లు కూడా బ‌య‌టకు వ‌చ్చేశాయి. అయితే ఏదోలా కోలుకొని మ‌ళ్లీ ఇంటికి వ‌చ్చారు విజ‌య్ కాంత్. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఆరోగ్యం క్షీణించ‌డం, ఆస్ప‌త్రి పాలు కావ‌డం.. ఇప్పుడు ప్రాణాలు కోల్పోవ‌డం అలా.. జ‌రిగిపోయాయి. విజ‌య్‌కాంత్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి, స‌డ‌న్ గా చ‌నిపోతే ఈ ఆరోప‌ణ‌ల్ని జ‌నాలు కూడా సీరియ‌స్‌గా తీసుకొనేవారేమో..? క‌నీసం లేని న‌డ‌వ‌లేని ప‌రిస్థితుల్లో విజ‌య్‌కాంత్ ని చూసిన అభిమానులు సైతం ఇది స‌హ‌జ మ‌ర‌ణ‌మే అని భావిస్తున్నారు. కాక‌పోతే నిప్పు లేనిదో పొగ రాదు. మ‌రి ఇవ‌న్నీ ఆరోప‌ణ‌లు, సంచ‌ల‌నం కోసం చేసిన ప్ర‌క‌ట‌న‌లేనా? తెర వెనుక ఏమైనా సీక్రెట్ ఉందా? అనేది తేలాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close