పార్టీ మారాక టీడీపీ వైఫ‌ల్యం మీద విశ్లేష‌ణ‌లు ఎందుకు..?

ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన తెలుగుదేశం నేత అంబికా కృష్ణ భాజ‌పా కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌నే, ఢిల్లీ వెళ్లి… భాజపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. ఆయ‌న భాజ‌పాలో ఎందుకు చేరారంటే… మోడీ నాయ‌క‌త్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంద‌నీ, ఆ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో త‌న‌వంతు భాగస్వామ్యం ఉండాల‌నే ఉద్దేశంతోనే చేరాన‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైకాపాకి ప్ర‌త్యామ్నాయంగా భాజ‌పా ఎదుగుతుంద‌నీ, చాలామంది మిత్రులు ఇప్పుడు భాజ‌పాలోకి వ‌స్తామ‌ని త‌న‌కి ఫోన్లు చేస్తున్నార‌నీ, వారంద‌రినీ ఆహ్వానిస్తున్నాన‌ని అంబికా కృష్ణ చెప్పారు. ఆ త‌రువాత‌, గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓట‌మిపై విశ్లేష‌ణ చేశారు!

ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం నాయ‌కులు అత్యంత నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేశార‌న్నారు! కానీ, అధినేత చంద్ర‌బాబు నాయుడు తీరు వ‌ల్ల‌నే పార్టీ ఘోరంగా ఓడిపోయింద‌న్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్ప‌ట్లో కోలుకోవ‌డం క‌ష్ట‌మే అన్నారు. న‌రేంద్ర మోడీతో వైరం పెట్టుకోవ‌ద్ద‌ని చాలాసార్లు తాము చంద్ర‌బాబుకి చెప్పామ‌నీ, కానీ ఆయ‌న ప‌ట్టించుకోలేద‌న్నారు. మ‌న వ్య‌వ‌హారాలేవో మ‌నం చూసుకుందామ‌ని చెప్పినా ఆయ‌న విన‌లేద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వంతో వ్య‌తిరేకంగా పోరాడ‌టం వ‌ల్ల‌నే టీడీపీకి ఈ గ‌తి ప‌ట్టింద‌ని విశ్లేషించారు. చంద్ర‌బాబు తీరు చాలామందికి న‌చ్చ‌లేద‌న్నారు!

పార్టీ మార‌గానే టీడీపీ ఓట‌మి మీద విశ్లేష‌ణ చేసేస్తున్నారు..! ఇదే విశ్లేష‌ణ పార్టీ ఉండి చేస్తే కొంతైనా అర్థ‌వంతంగా ఉండేదేమో క‌దా! కేంద్రంలో అధికార పార్టీ అండ కోసం అర్రులు చాచుతున్న‌వారంతా వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే వెళ్తున్న‌వారే ఎక్కువ‌. అది స్ప‌ష్టంగానే ప్ర‌జ‌ల‌కు అర్థ‌మౌతోంది. ఇంకోటి… ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులంతా నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రించార‌ని అంబికా కృష్ణ అంటున్నారు. స‌రే, ఆ నిబ‌ద్ధ‌తే ఉంటే, ఇప్పుడు పార్టీని వ‌దిలేసి భాజ‌పావైపు ఎందుకు వెళ్తున్న‌ట్టు అనే ప్ర‌శ్న వ‌స్తుంది క‌దా! పార్టీ అధికారంలో ఉంటేనేనా నాయ‌కుల‌కు నిబ‌ద్ధ‌త‌, పార్టీ మారిపోతున్నప్పుడు నిబ‌ద్ధ‌త ప్ర‌స్థావ‌న‌ రాదా? ఇంకోటి… కేంద్రంతో గొడ‌వ వ‌ద్దంటే చంద్రబాబు నాడు విన‌లేదంటున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల సాధ‌న‌కే కేంద్రంతో పోరాటం అని నాడు టీడీపీ నిర్ణ‌యించింది. అంటే, ఆ పోరాట‌మే త‌ప్పు అని ఇప్పుడు అంబికా విశ్లేషిస్తున్న‌ట్టా..? మొత్తానికి, టీడీపీ ఓట‌మి అధినాయ‌కుడు ఒక్క‌రిదే బాధ్య‌త అన్న‌మాట. నాయ‌కుల‌కు నిబద్ధ‌త ఉంది కాబ‌ట్టి, అధికారం ఉన్న‌చోటికి వెళ్లిపోతున్నార‌న్నార‌మాట‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close