2019 రివ్యూ : మార్పు చూసిన ఏపీ..!

కొత్త శతాబ్దంలో రెండో దశాబ్దం..  ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చెరగనిది. ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం.. దశాబ్దంలో అతి పెద్ద ఘట్టమైతే.. చివరి ఏడాది.. ప్రభుత్వం మార్పు.. ఆ తదనంతర పరిణామాలు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు.. కీలకంగా మారాయి. 2019 ఏడాది ప్రారంభమే రాజకీయ ఉద్రక్తలతో ప్రారంభమయింది. అప్పటికే.. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కట్టిన మహాకూటమి ఘోరపరాజయం పాలైంది. ఏపీలోనూ ఆ ప్రభావం కనిపించడం ప్రారంభమయింది. చంద్రబాబు రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు, వైసీపీ రాజకీయ వ్యూహాలతో .. అధికార పార్టీగా ఉన్న టీడీపీపై…  తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు.. ఏపీలో  సామాజికవర్గాల సంకుల సమరం ప్రారంభం కావడంతో.. ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తినక తప్పలేదు.

కులాల కుంపట్లు రేగడంతో.. ఎంత అభివృద్ధి చేసినా.. ప్రజల్లో చర్చకు పెట్టలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. అదే సమయంలో.. రమణదీక్షితుల దగ్గర్నుంచి పోసాని వరకూ వివిధ రకాల కులాలు, మతాల వారీగా..  టీడీపీపై వ్యూహాత్మకంగా దాడి చేయించింది వైసీపీ. ఫలితంగా.. కులాల పొలరైజేషన్ జరిగింది. జూన్‌లో జరిగిన ఓటింగ్‌లో టీడీపీ ఘోరపరాజయం పాలైంది. ఏడు నెలల కిందట.. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి మరో తరహా రాజకీయం నడుస్తోంది. అప్పటి వరకూ పరుగులు పెట్టిన ఏపీ అభివృద్ధి పనులు ఇప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో.. రెస్ట్ తీసుకుంటున్నాయి. కక్ష సాధింపు రాజకీయాలు జోరందుకున్నాయి. అవి ఎంతగా సాగాయంటే.. రూ. లక్ష రూపాయల ఫర్నీచర్ పేరుతో.. మాజీ స్పీకర్ కోడెలపై కేసులు.. ఆయన కుటుంబసభ్యులపై వరుస కేసులు పెట్టి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత తమపై వేధింపులు కొనసాగుతున్నాయని టీడీపీ నేతలు అంటూనే ఉన్నారు.

ఏపీ జీవనాడి పోవలరం ప్రాజెక్ట్ … మే వరకూ ఉద్ధృతంగా సాగిన పనులు ఆ తర్వాత ఆగిపోయాయి.  రివర్స్ పేరుతో కొత్త కాంట్రాక్టర్ కు పనులివ్వడంతో.. నత్తనడకన పనులు సాగుతున్నాయి. గత ప్రభుత్వం ఈ డిసెంబర్ కు పనులు పూర్తి చేయాలనుకుంది. కానీ ఈ ప్రభుత్వం 2021కి పూర్తి చేస్తామని చెబుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పనులు ఆ స్థాయిలో లేవు. ఇక ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కొలాప్స్ అయిపోయింది. ఆరు నెలల పాటు రాజధానిని మార్చబోమని.. నమ్మిస్తూ వచ్చిన ఏపీ సర్కార్.. చివరిలో.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినంత పని చేసింది. న్యాయవివాదాలు వస్తాయన్న కారణంగా.. చట్టబద్ధమైన కమిటీలతో పని పూర్తి చేయాలని.. బ్యాక్ ఫుట్ వేసింది కానీ.. రేపో ..మాపో తరలింపు ఖాయమని.. ప్రభుత్వ పెద్దలే బహిరంగంగా చెబుతున్నారు.

ఎన్నికలకు ముందు కులాల కుంపటితో ఆందోళనలు జరిగిన ఏపీలో ఎన్నికల తర్వాత.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో తరహా ప్రజా ఉద్యమాలు జరిగాయి. మొదటగా ఇసుక కోసం.. ప్రజలు అల్లాడిపోయారు. ఆరు నెలల పాటు వారి ఉపాధి దెబ్బతిన్నది. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. ఇప్పుడు.. అమరావతి కోసం.. ప్రజలు రోడ్డెక్కారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ నేతలు..  ప్రకటనలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉల్లి ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది.

ఒక్క చాన్స్ అంటూ.. ప్రజల మద్దతు పొందిన జగ్మన్మోహన్ రెడ్డి సర్కార్ పై ప్రజలకు ఎన్నో అంచనాలున్నాయి. ఆయన పాలన ప్రారంభించి ఏడు నెలలయింది. కానీ ఇప్పటికీ ఆయన ప్రజలు చూపించిన ఆశలు.. చెప్పిన ఆశయాల దిశగా .. అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం ఎవరికీ కలగడం లేదు. సంక్షేమ పథకాల్ని ఆయన చెప్పి న పద్దతిలో కాకుండా.. ఎలిమినేషన్.. నామినేషన్.. డినామినేషన్ పద్దతిలో.. ఇస్తున్నారు. ఫలితంగా.. నిజంగా లబ్దిదారులు పది శాతం కూడా ఉండటం లేదు. ఇంకా నవరత్నాల్లో.. కీలకమైన రత్నాలన్నింటినీ అమలు చేయాల్సి ఉంది.  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close