తెలంగాణ నుంచి ఆస్తులిప్పించాలని సుప్రీంకోర్టుకు ఏపీ !

ఉమ్మడి ఆస్తులు పంచాలని తెలంగాణను ఒక్క మాట కూడా అడగదు ఏపీ ప్రభుత్వం. కేంద్రం దగ్గర పంచాయతీ పెడితే పట్టుబట్టదు. ప్రమాణస్వీకారం చేయక ముందే కొన్ని ఆస్తులు తెలంగాణకు ఇచ్చేశారు జగన్. కనీసం కరెంటు బిల్లుల బకాయిలు కూడా వెనక్కి తీసుకోలేకపోతున్నారు. నాలుగేళ్లయినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు హఠాత్తుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని.. పంచడం లేదని.. పంచేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం కోరుతోంది.

ఉమ్మడి ఆస్తుల విలువ రూ. 1, 42, 601 కోట్లు ఉందని.. దాన్ని విభజించలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తెలంగాణనే కాలయాపన చేస్తోందని విభజన జరగాల్సిన ఆస్తులు 91 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. విభజన జరిగి ఎనిమిది ఏళ్లవుతున్నా.. ఆస్తుల విభజనకు తెలంగాణ సర్కార్ సహకరించడం లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిందని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని కోరింది.

ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ ప్రయోజనాలపై జగన్ పూర్తి స్థాయిలో రాజీపడిపోయారని.. అలా అయితే ఆయన రాజకీయ భవిష్యత్ కు పులిస్టాప్ పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆ అంశంపై దుమారం రేగింది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. అయితే ఉండవల్లి డిమాండ్ చేసినట్లుగా.. ఆయన దాఖలు చేసిన పిటీషన్‌లో ఇంప్లీడ్ కాకుండా… ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సర్కార్.

అయితే ఏపీ ప్రభుత్వ వైఖరి వల్ల మరింత ఏపీ నష్టపోతోందన్న వాదన వినిపిస్తోంది. అంత పెద్ద ఎత్తున ఆస్తులను.. కేంద్రంతో మాట్లాడి అయినా పంచుకోవాలి కానీ.. ిలా కోర్టుకెక్కడం వల్ల.. అక్కడే ఉండిపోతాయని.. ఎప్పటికీ తేలవన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close