బ‌న్నీ, మ‌హేష్‌, చ‌ర‌ణ్‌ల‌కు బ‌య్య‌ర్లు కావ‌లెను

పెద్ద సినిమా అన‌గానే ఓ ఎగేసుకుని ప‌డిపోయే రోజులు పోతున్నాయి. హిట్ట‌యితే నాలుగు డ‌బ్బులు రావ‌డం మాటేమోగానీ, ఫ్లాప్ అయితే మాత్రం చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఇక పూర్తిగా సినిమా రంగం నుంచి నిష్క్ర‌మించాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. బ్ర‌హ్మోత్స‌వం నుంచి అజ్ఞాత‌వాసి వ‌ర‌కూ బ‌డా హీరోలు ఇచ్చిన డిజాస్ట‌ర్లు అలాంటివి మ‌రి. అందుకే పెద్ద సినిమా అంటే.. బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డిపోతున్నారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు బ‌న్నీ, చ‌ర‌ణ్‌, మ‌హేష్ సినిమాల‌పై ప‌డింది.

నాపేరు సూర్య‌, బ్ర‌హ్మోత్స‌వం, రంగ‌స్థ‌లం.. త్వ‌ర‌లో రాబోతున్న పెద్ద సినిమాలు. చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, బ‌న్నీల‌కున్న మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పేదేముంది? వీళ్ల సినిమాకు హిట్ టాక్ వ‌చ్చిందంటే… వ‌సూళ్లు బ్ర‌హ్మాండంగా ఉంటాయి. అందుకే విడుద‌లకు ముందు అన్ని ఏరియాలూ క్లీన్ స్వీప్ చేసుకొని…. మంచి టేబుల్ ప్రాఫిట్‌తో సినిమాలు విడుదల అవుతుంటాయి. కాక‌పోతే ఈసారి విభిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపించే అవ‌కాశం ఉంది. పెద్ద సినిమాల్ని కొన‌డానికి బ‌య్య‌ర్లు స‌ముఖంగా లేరు. కొందామ‌ని వెళ్తున్నా… భారీ రేట్లు చెప్పి నిర్మాత‌లు భ‌య‌పెట్టేస్తున్నారు. సినిమా హిట్ట‌యినా ఆ స్థాయిలో వ్యాపారం జ‌రిగే అవ‌కాశం లేద‌ని గ్ర‌హిస్తున్న బ‌య్య‌ర్లు రిస్క్ తీసుకోవ‌డానికి జంకుతున్నారు.

దాంతో పాటు ఈ మూడు సినిమాల ఫీడ్ బ్యాక్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. సుకుమార్ మంచి ద‌ర్శ‌కుడే. కానీ… త‌న‌పై న‌మ్మ‌కం ఉంచ‌లేం. త‌న సినిమాల‌న్నీ క్లాస్ సెంట‌ర్ల‌కే ప‌రిమితం అవుతుంటాయి. పైగా… ‘రంగ‌స్థ‌లం’ ఆల‌స్య‌మ‌వుతూ.. అవుతూ వ‌స్తోంది. ‘నాపేరు సూర్య‌’కి టాక్ బాగానే ఉంది.కానీ వ‌క్కంతం వంశీ కొత్త ద‌ర్శ‌కుడు. బ‌న్నీనీ, ఇంత పెద్ద ప్రాజెక్ట్ నీ ఎలా డీల్ చేశాడా అనే అనుమానాలు ఉండ‌డం స‌హ‌జం. ఇక ‘భ‌ర‌త్ అను నేను’ విష‌యానికొస్తే… మ‌హేష్ అస‌లే ఫామ్ లో లేడు. బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అన్నింటికంటే ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే… ఈ మూడు సినిమాల‌కూ ‘రీ షూట్ల‌’ ఎఫెక్ట్ ప‌డింది. కొన్ని స‌న్నివేశాలు న‌చ్చ‌క రీషూట్లు చేశార‌ని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో బ‌య్య‌ర్లు ఈ సినిమాల‌పై అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. పంపిణీరంగంలో అనుభ‌వ‌జ్ఞులైతే ఆయా సినిమాల‌కు దూరంగా ఉండాల‌నే నిర్ణ‌యించుకున్నారు. కొత్త‌గా అడుగుపెట్టిన‌వాళ్లే సినిమాల‌పై మోజుతోనో, అనుభ‌వం లేక‌నో.. నిర్మాత‌లు చెప్పే రేట్ల‌కు ప‌డిపోతుంటారు. అలాంటి వాళ్లు ఎవ‌రు దొరుకుతారా అని ఈ మూడు సినిమాలూ ఎదురు చూస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.