రేవంత్‌ను దూరం పెడితే కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ స్నేహహస్తం !?

కాంగ్రెస్ పార్టీతో సాఫ్ట్‌గా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు వ్యూహాత్మకంగా తెలంగాణలో ఆ పార్టీకి పిల్లర్‌గా మారిన రేవంత్ రెడ్డిపై గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్‌పై విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫిర్యాదులు చేస్తున్నారు. అదీ కూడా నేరుగా రాహుల్ గాంధీకి.. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు వెళ్లేలా చేస్తున్నారు. కేసీఆర్ మూడు రోజుల బర్త్ డే వేడుకలు జరుపుకోవడంపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటిని ఓ పత్రికి కాస్త భిన్నంగా రిపోర్ట్ చేసింది. కేసీఆర్ చావును రేవంత్ కోరుకుంటున్నారన్నట్లుగా రాసింది. కానీ రేవంత్ అన్నది అది కాదు.

అయితే కేటీఆర్ వెంటనే ఆ పేపర్ క్లిప్పింగ్‌తో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కేసీఆర్ మానవత్వం ఉన్న మనిషిగా సోనియాపై బీజేపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తే మీ పీసీసీ చీఫ్ కేసీఆర్ చావును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారితోనే కాంగ్రెస్ నడిపేది అన్నట్లుగా ట్వీట్ చేశారు. కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి శశిధరూర్ గురించి చేసిన వ్యాఖ్యల ఆడియోను టీఆర్ఎస్ నేతలు వైరల్ చేసి… కాంగ్రెస్ హైకమాండ్‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. అది కాస్త కలకలం రేపింది.

రేవంత్ వ్యూహత్మకంగా వెంటనే ధరూర్‌కు క్షమాపణలు చెప్పి వివాదాన్ని ముగించారు. ఆ తర్వాత వీలైనప్పుడల్లా రేవంత్‌ను టార్గెట్ చేసి.. కాంగ్రెస్ పట్ల టీఆర్ఎస్ సాఫ్ట్‌గానే వ్యవహరిస్తోంది. బహుశా కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇది సంకేతాలివ్వడం అని భావిస్తున్నారు. రేవంత్ ను సైడ్ చేస్తే తాము స్నేహహస్తానికి సిద్ధంగా ఉన్నామన్న ఓ రకమైన భావం ఇందులో ఉందంటున్నారు. అయితే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నమ్మడం అంత తేలికగా జరిగేది కాదన్న అభిప్రాయం ఆ పార్టీలో ఉంది. గత అనుభవాలు అలా ఉన్నాయి మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close