తిరుమలలో జరగని అపవిత్రం ఏం మిగిలింది .. చివరికి డ్రోన్ కూడా !

ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీవారి దర్శనం సామాన్యులకు దూరం చేయడం దగ్గర్నుండి… జరగాల్సిన అపవిత్రాలన్నింటినీ చేసేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలిగించడం ఓ ఎత్తు అయితే ఇప్పుడు ఆలయంపై డ్రోన్ ఎగరేసి మరీ వీడియోలు చిత్రీకరించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయంపై దర్జాగా డ్రోన్ ఎగురవేసి వీడియోలు చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇవి వైరల్ గా మారాయి. అసలు డ్రోన్ ను ఎలా అనుమతించారన్నది పజిల్ గా మారిపోయింది.

శ్రీవారి ఆలయం నో ఫ్లై జోన్ లో ఉంది. అక్కడ గాల్లో ఎగరడానికి ఎలాంటి యంత్రాలను అనుమతించరు. కానీ డ్రోన్ ఎగురవేశారు. ఇది ఆగమశాస్త్రానికి కూడా విరుద్ధం కావడంతో పండితులు కూడా నిర్ఘాంతపోతున్నారు. ఇక భక్తుల సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ టీటీడీకి మాత్రం ఈ విషయం తెలియదు. సోషల్ మీడియాలో లక్షల మంది చూసిన తర్వాత… నిజమా అని ఆశ్చర్యపోయి.. కంటి తుడుపు ప్రకటనలు చేస్తోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి .. విచారణ చేయిస్తామని చెబుతూనే .. అది ఏవో మ్యాపులు తీసుకుని గ్రాఫిక్స్ చేయించారని చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు డ్రోన్స్ ఎగరడానికి అవకాశమే లేదని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చెబుతున్నారు. ఫోరెన్సిక్ కు పంపిస్తామని అంటున్నారు.

కానీ ఆ దృశ్యాలను చూసిన ఎవరికైనా అవి గ్రాఫిక్స్ లేదా.. మరో టెక్నికల్ ్రయత్నం అని ఎవరూ అనుకోరు. అది నిజంగాన్ డ్రోన్స్ తో చిత్రీకరించారని కాస్తంత పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. జరిగిన తప్పునకు ఎవరు బాధ్యులో డిసైడ్ చేయడానికి టీటీడీకి మనసొప్పేలా లేదు.

తిరుమలకు వెళ్లి వస్తున్న ప్రతి ఒక్క భక్తుడు … టీటీడీని దారుణంగా విమర్శించకుండా రావడం లేదు.గతంలో క్యూ లైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉన్నప్పుడు.. భక్తులకు అన్న పానీయాలు అందించేవారు. కానీ ఇప్పుడు.. చిప్స్ పాకెట్లు తెచ్చి అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నభ క్తులు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతీ చోటా వ్యాపార దృక్పథమే కనిపిస్తోంది చివరికి లీటర్ వాటర్ రూ. యాభైకి కొనాల్సి వస్తోంది. ఇంత దారుణంగా టీటీడీ పాలన ఉందని భక్తులు మండి పడుతున్నా.. వారి తీరు మారడం లేదు. ఇప్పుడు ఏకంగా శ్రీవారి ఆలయంపై డ్రోన్స్ ఎగురవేసిన గుర్తించలేకపోయారు. గుర్తించలేకపోయారా.. లేక ఇంటి దొంగల సహకారంతోనే ఇది జరిగిందా అనేది బయటకు రాదేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close