కేసీఆర్ లోనూ మార్పు మొద‌లైందా…?

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మార్మోగిన నినాదం మార్పు కావాలి. ఒక్క మాట కాంగ్రెస్ కు ఎంతో మేలు చేయ‌గా… తొమ్మిదిన్న‌ర సంవ‌త్స‌రాల కేసీఆర్ పాల‌న‌కు ముగింపు ప‌లికింది. నాటి నుండి నేటి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి త‌న స్పీచ్ లో మార్పు తెస్తున్నాం మాట‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ వ‌స్తున్నారు.

అయితే, కేసీఆర్ అన‌గానే… ఎవ‌రినీ క‌ల‌వ‌డు, ఫాంహౌజ్ కే ప‌రిమితం అవుతారు, త‌ను కల‌వాల‌నుకుంటే త‌ప్పా ఎవ‌రికీ ఫాంహౌజ్ కు అనుమ‌తి ఉండ‌దు అనేది అంద‌రికి తెలిసిందే. కానీ అధికారం పోయాక కానీ ఆయ‌న‌కు అస‌లు త‌త్వం బోధ‌ప‌డిన‌ట్లు లేదు.

అధికారం పోయాక పార్టీ నుండి నేత‌లు చేజారుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఎవ‌రు ఎప్పుడు షాకిస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక కేసీఆర్ ఇప్పుడు కూడా మార‌క‌పోతే బీఆర్ఎస్ ఇక మ‌రోసారి అధికారంలోకి రావ‌డం క‌లే అని సొంత పార్టీ నాయ‌కులే కామెంట్ చేసిన ప‌రిస్థితుల్లో… కేసీఆర్ రియాల్టిలోకి వ‌స్తున్న‌ట్లుగా క‌న‌ప‌డుతోంది.

ఈ మ‌ధ్య కేసీఆర్ నందిన‌గ‌ర్ ఇంటిక‌న్నా ఫాంహౌజ్ కే ఎక్కువ‌గా ప‌రిమితం అవుతున్నారు. పార్టీ స‌మావేశాల‌కు అక్క‌డి నుండే వెళ్తున్నారు. నాయ‌కుల‌ను కూడా అక్క‌డికే పిలిచి మాట్లాడుతున్నారు. అయితే, గ‌త 15రోజులుగా ద్వితీయ శ్రేణి నేత‌ల‌తో పాటు నాయ‌కుల వెంట వ‌చ్చే కొద్ది మంది క్యాడ‌ర్ ను కూడా కేసీఆర్ క‌లుస్తున్నారు. ఎంతో కొంత స‌మ‌యం వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ… ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో మా సారు మారారు… అంటూ సెకండ్ గ్రేడ్ క్యాడ‌ర్ హ్య‌పీగా ఫీల్ అవుతున్నారు.

అయితే, ఇదంతా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స్టంట్ అని… ఎన్నిక‌ల‌య్యాక కేసీఆర్ ఎప్పుడు ద‌ర్శ‌నం ఇస్తారో కూడా తెలియ‌దు అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కేసీఆర్ అంటేనే ఏ పూట‌కు ఆ పూట రాజ‌కీయం చేసే టైపు… ఆయ‌న్ను పూర్తిగా ఇప్పుడే నమ్మ‌లేం అనే వారు కూడా లేక‌పోలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close