హైకోర్టులో రోజూ అక్షింతలే – ఏపీ ప్రభుత్వం సిగ్గుపడదా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నుంచి అక్షింతలు పడని రోజంటూ లేదు. ఏపీ ప్రభుత్వ నిర్వాకంపై బాధితులు కోర్టును ఆశ్రయించడం.. . అలాంటి విషయాల్లో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించడం కామన్ గా మారిపోయింది. సలహాదారుల దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ హైకోర్టు గట్టిగా వాతలు పెడుతోంది. నిన్నటికి నిన్న ఓ కాంట్రాక్టర్ … ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణగా అప్పలు పాలై.. బంధువుల ఇంట్లో దొంగతనం చేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. దీన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఇక పించన్ దార్లను పిక్ పాకెటర్లుగా మారుస్తారా అని మండిపడింది. ఓ ప్రభుత్వం ఇంత దారుణంగా విమర్శలకు గురయిందంటే… నైతికంగా పతనమైనట్లే. అయితే ఏపీ ప్రభుత్వం ఎప్పుడో ఈ స్థితికి చేరింది. నైతికత అనేదే లేకుండా పోయింది.

ఇక ఎస్సీ కార్పొరేషన్ నిధుల దారి మళ్లింపుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. దళిత యువతకు ఉపాధి కల్పించడం లేదు. ఏమన్నా అంటే నవరత్నాల పథకాల కింద నిధులు ఇస్తున్నామని చెబుతారు. అందరికీ ఇచ్చే పథకాలనే ఎస్సీలకు ఇస్తూ… అవే ఎస్సీ కార్పొరేషన్ నిధులని మళ్లిస్తున్నారు. దీంతో దళితులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది.

ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం హైకోర్టు స్పష్టంగా బయట పెడుతోంది. బాధితులు ఎవరు హైకోర్టును తలుపు తట్టినా న్యాయం అందించడానికి ప్రయత్నిస్తోంది. కానీ రాజ్యం మాత్రం హైకోర్టును … పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆదేశాలు అమలు చేయడం లేదు. కోర్టు ధిక్కరణకు సిద్ధ పడుతోంది కానీ బాధితులకు న్యాయం చేయడం లేదు. ప్రభుత్వం అన్యాయం చేస్తే హైకోర్టు దాకా వచ్చే బాధితులు తక్కువే. ఒక్క శాతం కూడా ఉండరు. అలాంటి వారికీ కోర్టులు చెప్పినా ప్రభుత్వ న్యాయం చేయడం లేదు.

గతంలో ఏదైనా ప్రభుత్వం హైకోర్టు ఓ ఘాటు వ్యాఖ్య చేస్తే సిగ్గుపడేవి. తప్పు చేస్తున్నామని అనుకునేవి. కానీ ఇప్పటి ప్రభుత్వానికి అవేమీ లేవు. ఇంకా ఎదురు హైకోర్టును తప్పు పట్టే పరిస్థితి వచ్చింది..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close