ఫెయిలయిన వాళ్లకి కొత్త ఆశలు..! కానీ ఇంటర్ బోర్డుపై అపనమ్మకమే..!

ఫెయిలయిన విద్యార్థుల పేపర్లను దిద్దాలంటే.. కనీసం రెండు నెలలు పడుతుందని.. హైకోర్టుకు చెప్పిన ఇంటర్ బోర్డు అధికారులు.. ఇప్పుడు మాత్రం ఆ పనిని.. పది రోజుల్లో పూర్తి చేయడానికి శరవేగంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో… రీ వెరీఫికేషన్, రీ కౌంటింగ్ ఏర్పాట్లను… విద్యాశాఖ పూర్తి చేసింది. మొత్తంగా ఎనిమిది సెంటర్లలో అఘమేగాలపై ఏర్పాట్లు చేసింది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయిన మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది పేపర్లను.. ఆయా సెంటర్లకు తరలించి… రీ వెరీఫికేషన్, రీ కౌంటింగ్ చేయించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని.. విద్యాశాఖ ప్రకటించింది.

వీలైనంత త్వరగా.. ఈ ప్రక్రియ పూర్తి చేసి.. మార్కుల జాబితాలు అందించాలని.. ఇంటర్ ఫలితాల గందరగోళంగా సమీక్ష నిర్వహించిన కేసీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇతర జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలు ఉన్నందున.. ఒక్క విద్యార్థి కూడా.. నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. ఈ క్రమంలో… రీ వెరీఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి… వచ్చే నెల పదిహేనో తేదీ కన్నా… మార్కలు జాబితాలు విద్యార్థులకు అందేలా చూస్తామని.. స్పష్టం చేశారు. దీంతో ఫెయిలయిన విద్యార్థుల్లో కొత్త ఆశలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఇంటర్ బోర్డు తీరు కంటి తుడుపు వ్యవహారంలా ఉందన్న అభిప్రాయం.. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఇష్టం వచ్చినట్లు మార్కులు వేశారని తేటతెల్లం అయింది కాబట్టి.. కష్టపడి చదివి.. తక్కువ మార్కులు వచ్చిన వారి పేపర్లను కూడా.. రీ వెరీఫికేషన్ ను ఉచితంగా చేయాలన్న డిమాండ్‌ను వారి వినిపిస్తున్నారు.

అనేక మంది విద్యార్థులు తాము రాసిన సమాధానాలకు.. వచ్చిన మార్కులకు పొంతన లేదని అంటున్నారు. మొదటి ఏడాది.. అన్ని సబ్జెక్టులలో 90 శాతానికిపైగా మార్కులు తెచ్చుకుని.. రెండో ఏడాదిలో ఒక్క సబ్జెక్ట్ అరకొర మార్కులతో పాసయిన వారి పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. ఆ ఒక్క సబ్జెక్ట్ వల్ల… మొత్తం మార్కుల సగటులో తేడా వస్తుందని బాధపడుతున్న వారు కూడా వేలల్లో ఉన్నారు. ఈ కారణంతో వేలల్లో.. ఆన్సర్ షీట్ల కోసం… ఆర్టీఐ చట్టం ద్వారా… దరఖాస్తు చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close