ఒక్క డాలర్‌కి రూ. 80 – ఇది మోదీ విక్టరీనే !

మోదీ ప్రధానమంత్రి అయితే రూపాయికే్ పది డాలర్లు వస్తాయని ప్రచారం చేశారు. మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నప్పుడు డాలర్‌కు నలభై ఐదు రూపాయలు ఉంటే.. ప్రధాని లాగే చాలా వీక్‌గా ఆర్థిక వ్యవస్థ ఉందని దుయ్యబట్టారు. తాము రాగానే రూపాయి కండలు పెంచుతుందని డాలర్‌ను మించిపోతామని చెప్పారు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయింది. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 80కి చేరింది. అంటే ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లోకి పోయిందన్నమాట. మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య విల్వలు వేగంగా తగ్గిపోవడానికి ఇదో సూచిక.

భారత్ దిగుమలు చేసుకుంటున్న ప్రతి వస్తువుకు.. బిల్లు డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఎగుమతులకు డాలర్లే వస్తాయి. కానీ ఈ రెండింటి మధ్య. హస్తిమశకాంతరం తేడా ఉంటుంది. చాలా కాలంగా నిల్వ చేసుకుంటూ వస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. రూపాయి పతనం విదేశాల నుంచి డబ్బులు పంపేవారికి మాత్రమే మేలు చేస్తుంది. అది కూడా ఓ వైపే. మరో రకంగా వారికీ ఇబ్బందికరమే. ఇక విదేశాల్లో చదువుకుంటున్న వారి పరిస్థితి దుర్భరంగా మారుతుంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎంత బలంగా ఉంటే… ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే గత ఎనిమిదేళ్లుగా బలమైనప్రభుత్వంలో రూపాయి మాత్రం బలహీనపడుతూ వస్తోంది. దీన్ని ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఆర్బీఐ కూడా ఏమీ చేయలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు రూపాయిపతనంపై మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయననుఉద్దేశించే వైరల్ చేస్తున్నారునెటిజన్లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close