స్కూల్ ఫీజుల జీవోను కొట్టేసిన ఏపీ హైకోర్టు ! టిక్కెట్ల జీవో మాత్రం చెల్లుతుందా ?

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని హైకోర్టు స్పష్టం చేసింది . ప్రైవేట్‌ స్కూళ్లు, జూ.కాలేజీలకు మీరెలా ఫీజులు ఖరారు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయింది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఏడాదికి రూ . పది నుంచి పద్దెనిమిది వేలకు మించి ఫీజులు వసూలు చేయకూడదని ఏపీ ప్రభుత్వం గత ఆగస్టులో జీవో జారీ చేసింది. పైగా ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజుల్లోనే అన్నీ ఉంటాయి.. అంటే ట్యూషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్‌ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్‌ ల్యాబొరేటరీ, స్టూడెంట్‌ వెల్ఫేర్, స్టడీ టూర్‌ ఇలా అన్నీ అందులోనే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని జీవోలో పేర్కొంది. ఏ సౌకర్యాలు లేని స్కూళ్లలో కూడా ఆ ఫీజులు గిట్టుబాటు కావని ఇప్పటి ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నాయని యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. హైకోర్టును ఆశ్రయించాయి. టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేమని వారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిజానికి ఈ ఫీజుల జీవో.. కరోనా కారణంగా అనేక ప్రైవేటు స్కూళ్లు మూతపడ్డాయి. చివరికి హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది.

ప్రతి ప్రైవేట్‌ స్కూళ్లు, జూ.కాలేజీల అభిప్రాయాలను తీసుకున్నాకే.. ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ జీవో అచ్చంగా సినిమా టిక్కెట్ల జీవోలాంటిదే. సినిమా టిక్కెట్ల జీవోను కూడా ఇంతే ఏకపక్షంగా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రైవేటు వ్యాపారానికి ప్రభుత్వం ధరలు నిర్ణయించడం అనేది … సినిమా విషయానికి వర్తించదన్న వాదన బలంగా ఉంది. ఈ క్రమంలో స్కూల్ ఫీజులును ఖరారు చేస్తూ ఇచ్చిన జీవోను కొట్టి వేయడంతో త్వరలో సినిమా టిక్కెట్ల జీవోకూ అదే పరిస్థితి ఎదురవుతుందన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close