జాతీయ రాజకీయం ప్రారంభించకుండానే మిత్రుల నమ్మకం కోల్పోతున్న కేసీఆర్ !?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు. వారిలో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎంలు, ఒకరు లెఫ్ట్ పార్టీ సీఎం. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి సపోర్టుగా నిలిచిన కొంత మంది ఎక్కడా కనిపించలేదు. వారిలో ముఖ్యులు కర్ణాటక జేడీఎస్ నేత కుమారస్వామి, మరొకరు తమిళనాడు వీసీకే పార్టీకి చెందిన ఎంపీ తిరుమాలవన్. ఇప్పుడు వారు కేసీఆర్ వెంట లేరు. బీఆర్ఎస్ ఆవిర్భావసభకు కూడా రాలేదు. కేసీఆర్ తో పొత్తులు ఉంటాయని.. ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌తో కలిసి పని చేయాలనివారు అనుకున్నారు. కానీ హఠాత్తుగా డ్రాప్ అయిపోయారు.

నిజానికి కేసీఆర్ సభకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి పొత్తులు ఎవరితోనూ పెట్టుకోదు. కేజ్రీవాల్ కు సొంత లక్ష్యాలున్నాయి. ఆయన రెండు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీకి జాతీయ హోదా కూడా వచ్చింది..కాబట్టి.. కేసీఆర్ ఓ కూటమి పెట్టినా.. అందులో ఆమ్ ఆద్మీ రాదు. అలాగే.. లెఫ్ట్ పార్టీలు కూడా. తెలంగాణలో సీట్ల కోసం లెఫ్ట్ పార్టీలు.. కేసీఆర్ తో పొత్తులు పెట్టుకుంటాయి కానీ.. జాతీయ స్థాయిలో ఆయన వెంట నడవవు. రాహుల్ గాంధీ పాదయాత్రలో లెఫ్ట్ పార్టీల నేతలు పాల్గొంటున్నారు . కేసీఆర్ సభలో పాల్గొన్న సీపీఐ నేత రాజా.. రాహుల్ పాదయాత్రలోనూ పాల్గొంటానని అదే రోజు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.

అంటే కేసీఆర్.. సభకు వచ్చిన వారు జాతీయ రాజకీయాల్లో ఆయన వెంట ఉండరు. ఉంటారనుకున్న వారు నమ్మకం కోల్పోయారు. ఈ కారణంగాకేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తొలి అడుగులే తడబడుతన్నాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. భారీ ఆర్థిక సాయం ఎన్నికల్లో ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇతర నేతల్ని ఆకర్షిస్తున్నారని.. ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారిలో అఖిలేష్ లాంటి నాయకులు ఉన్నా.. వారు కేసీఆర్ తో జత కట్టడం అనేది ఉండదని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ .. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే.. నమ్మకస్తులైన నేతల్ని గ్రూపుగా ఉంచుకోవాలన్న సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close