ఏపీకి రావాలంటే కేసీఆర్ వాటన్నింటిపై క్లారిటీ ఇవ్వాల్సిందే !

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి శాఖ దాదాపుగా ఏర్పాటయింది. కానీ ఇల్లు అలకగానే పండగ కాదు. కేసీఆర్ ఏపీకి రావాలంటే చాలా అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతల చేరికల సందర్భంగా కేసీఆర్ వీటిపై స్పష్టత ఇవ్వలేదు. కనీసం ప్రస్తావించలేదు. వ్యూహాత్మకంగా ప్రసంగించారు. ఏపీలో దున్నేస్తామని కానీ.. మరొకటి కానీ చెప్పలేదు. పూర్తిగా జాతీయ కోణంలోనే కేసీఆర్ స్పీచ్ సాగింది. రాష్ట్ర సమస్యలపై నిర్దిష్టమైన విధానం చెప్పలేదు. అలాంటి వాటిపై స్పందించకపోతే ప్రజలు పట్టించుకోరు.

గత ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకున్న కేసీఆర్.. వైసీపీతో కలిశారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఇప్పటి వరకూ రాయలేదు. ప్పుడు ఏపీలో ప్రత్యేకహోదా అంశం కాదు.. ఒక రాజధానా. మూడు రాజధానులా అన్నది సమస్య. దీనిపై కేసీఆర్ ఏదో ఓ విధానం ప్రకటించాల్సి ఉంది. గతంలో కేటీఆర్ మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ విధానం ఇదేనా.. లేకపోతే మార్పు ఉందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

విభజన ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రెండు తెలుగురాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా సమస్యలు ఉన్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం తెలంగాణపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉమ్మడి ఆస్తులు పంచడం లేదని న్యాయం చేయాలని కోరుతోంది. లక్ష కోట్లకుపైగా ఆస్తులు పంచాల్సి ఉందని చెబుతోంది. అలాగే విద్యుత్ బకాయులు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఇక జల వివాదాల విషయంలో ఎన్ని ఫిర్యాదులు.. రెండు రాష్ట్రాలపై ఒకరిపై ఒకరు చేసుకున్నారో చెప్పడం కష్టం. పోలవరంప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాల్సిందేనని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది పోలవరం ఏడు మండలాలు తెలంగాణకు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలంటున్నారు. వీటన్నింటిపైనా కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చు.. అక్కడ పెద్దగా సవాళ్లు ఎదురు కావు. కానీ ఏపీలో మాత్రం అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే.. ఏపీ తెలంగాణతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం కూడా ఏపీ వ్యతిరేకత కేంద్రంగానే నడిచింది. వీటన్నింటిని కాదని.. ఎవరో నలుగుర్ని చేర్చుకుని ఏపీలో సభ పెట్టి వెళ్లిపోతే.. అది రాజకీయం అనిపించుకోలేదు. మరి కేసీఆర్ క్లారిటీ ఇస్తారా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close