మోదీ…నువ్వు నన్ను గోకపోయినా నేనే నిన్ను గోకుతాను : కేసీఆర్

తన మీదకు ఇంకా ఈడీ, సీబీఐ, ఐటీలు లాంటివి రావట్లేదని కేసీఆర్ అనుకుంటున్నారో లేకపోతే మోదీని రెచ్చగొట్టాలనుకుంటున్నారో కానీ మునుగోడు సభలో విచిత్రమై వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ముగ్గురు సభ్యులున్నవారు తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారని.. అహంకారమా… బలుపా అని ప్రశ్నించారు. ఈడీ లేదూ బోడీ లేదు.. అన్నాననని కేసీఆర్ తెలిపారు. ప్రజల కోసం నిలబడే వాళ్లు ప్రజల కోసం ఆలోచించే వాళ్లు మోదీకి భయపడరన్నారు. మోదీ…నువ్వు నన్ను గోకినా గోకపోయినా నేను నిన్నే గోకుతాను. తమిళనాడు, బెంగాల్‌లో ప్రభుత్వాలను పడగొడతానంటారు. నిన్ను పడగొట్టేవాళ్లు లేరా… ఉన్నారు. నీ అహంకారమే నీకు శత్రువు అవుతుంది.. నిన్ను ముంచేస్తుందని మోదీని హెచ్చరించారు. తెలంగాణ కోసం నిలబడ్డానంటే దానికి మీరిచ్చిన శక్తే కారణమని.. ఇప్పుడు ఆగం చేస్తే తెలంగాణ ఏమవుతుందని ప్రశ్నించారు.

కేసీఆర్ ఈ సభలో ఓటర్లకు రెండే చాయిస్‌లు ఇచ్చారు. మీటర్లు పెట్టే మోదీ కావాలా… మీటర్లు వద్దనే కేసీఆర్‌ కావాలా.. ప్రశ్నించుకోవాలన్నారు. గజరాత్‌లో ఆరువందలు పెన్షన్ ఇస్తున్నారు.. మాకు ఓట్లు వేయడం లేదా అని అడుగుతున్నారు.. ఆరువందలు ఇచ్చే బీజేపీకి ఇద్దామా… రెండు వేలు ఇచ్చే టీఆర్‌ఎస్‌కు టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారా అని కేసీఆర్ ఓటర్లను ప్రశ్నించారు. ఇంటికి వెళ్లిన తర్వాత కేసీఆర్‌ సభకు పోయిన తర్వాత ఆయన ఈ ముచ్చట చెప్పారు ఇది నిజామా కాదా అని చర్చ పెట్టాలన్నారు. రైతులంతా బోరు వద్దకు వెళ్లి దండం పెట్టి ఓటు వేయాలి. గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి ఓటు వేయాలి. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలకు రావాలంటే… ఈ దుర్మార్గులకు తరిమికొట్టాలని కేసీార్ పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా కృష్ణా జలాల పంపిణీ జరగలేదు. కృష్ణా జలాలు ఇయ్యనందుకే ఇక్కడ మోదీ సభ పెట్టారా అని కేసీఆర్ ప్రశ్నించారు.

కమ్యనిస్టు పార్టీలతో కలిసి నడుస్తున్నామని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ప్రగతి శీల పార్టీలన్నీ ఏకం కావాలి ఈ దుర్మార్గులను పంపించాలని నిర్ణయించుకున్నామని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే శనగలు బావిలో వేసినట్టే… ఆ ఓటు వ్యర్థమవుతుందన్నారు. ఇవాళ వ్యక్తికి వేయడం ముఖ్యం కాదు. తెలంగాణ ఏమంటుుందనేది ముఖ్యం. దేశమంతా చూస్తున్నారు. గారడీ విద్యలు, బొమ్మలు చూసి మోసపోతే గోస పడతామని హెచ్చరించారు. మీరు ఒక్కొక్కరు ఒక్కో కేసీార్ కావాలని సీఎం ఓటర్లకు పిలుపు నిచ్చారు. మొత్తంగా మునుగోడులో కేసీఆర్ ప్రసంగం సూటిగా సుత్తిలేకుండా సాగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close