బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే వెలుగు జిలుగుల భారత్ : కేసీఆర్

బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే వెలుగు జిలుగుల భారత్ తయారు చేస్తామని భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో కేసీఆర్ తెలుగులో దేశ ప్రజలకు హామీ ఇచ్చారు ఇదొక్కటే కాదు.. ఆయన మార్క్ హామీలు ఈ సభలో వరదలా ప్రవహించాయి. దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్. .. రైతు బంధు పథకం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు.
దళిత బంధు పథకాన్ని ఇప్పుడే అమలు చేయాలని కేంద్రాన్ని డి్మాండ్ చేశారు. చేయకపోతే… తాము వచ్చాక చేస్తామన్నారు. మహిళలను 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు.

ఇక బీఆర్ఎస్ గెలవగానే ప్రతి ఇంటికి మంచి నీళ్లు వస్తాయని.. అగ్నిపథ్ రద్దు చేసి.. పాత పద్దతిలోనే సైన్యం నియామకాలు చేస్తామని ప్రకటించారు. ఇత విశాఖ ఉక్కు, ఎల్ఐసీని అమ్ముతామంటున్నారని.. అమ్మేసినా తాము రాగానే జాతీయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ సంస్థలనూ ప్రైవేటీకరణ చేస్తున్నారని.. తాము పబ్లిక్ సెక్టార్ లోనే ఉంచుతామన్నారు. ఈ రంగాల వాళ్లంతా బీఆర్ఎస్‌కు పిడికిలి ఎత్తి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

భారత్‌ సమాజం లక్ష్యం ఏంటి అని ఆలోచిస్తే అసలు తెలియడం లేదని.. భారత్ తన లక్ష్యాన్ని కోల్పోయిందా… దారి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి సంపద ఉందన్నారు. ప్రపంచ బ్యాంకు, అమెరికా, విదేశీయుల అవసరం లేని.. ఈ దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల, రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. అన్నీ ఉండి కూడా ఎందుకు యాచకులం కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. దేశం సుసంపన్న కావాలంటే ప్రజలకు ఉచితంగా అన్నీ అందాలంటే.. బీఆర్ఎస్ రావాల్సిందేనన్న సందేశాన్ని కేసీఆర్ బీఆర్ఎస్ సభ ద్వారా ఇచ్చారు.

పనిలోపనిగా ఖమ్మంకు వరాల జల్లు కురిపించారు. ఖమ్మంలో జిల్లాలో 589 గ్రామ పంచాయితీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయితీకి పది లక్షలు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ది వేల జనాభాకు మించిన ఉన్న మేజర్ పంచాయతీలకు పది కోట్ల రూపాయలు . మున్నేరు నదిపై కొత్త బ్రిడ్జి . ఇతర మున్సిపాలిటీలకు తలో 30 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఖమ్మం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేశామని ప్రకటించారు. ఖమ్మం హెడ్‌ క్వర్టర్స్‌లో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే గతంలో ఇలాంటి ప్రకటనలుకేసీఆర్ వందల సార్లు చేశారు కానీ.. జరిగింది తక్కువే. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలివ్వాలని సుప్రీంకోర్టు కేసు క్లియర్ చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.

కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభ అయినా మొత్తం తెలుగులోనే ప్రసంగించారు. మరి దేశ ప్రజలకు తన సందేశం హామీలు ఎలా అర్థమవుతాయని అనుకున్నారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close