జాతీయ నేత‌లు ప‌ర్య‌టిస్తే పార్టీ బ‌ల‌ప‌డుతుందా..?

తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ జ‌న చైత‌న్య యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర‌ను భాజ‌పా ప్ర‌తిష్టాత్మంగా తీసుకుంది. అయితే, జాతీయ నేత‌లు ఈ యాత్ర‌లో భాగ‌స్వామ్య‌మైతే పార్టీని ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌నీ, పార్టీ శ్రేణుల‌తోపాటు ప్ర‌జ‌ల్లో కూడా మంచి ఊపు వ‌స్తుంద‌ని ల‌క్ష్మ‌ణ్ భావిస్తున్నారు. అందుకే, రెండో విడ‌త యాత్ర‌లో వ‌రుస‌గా జాతీయ స్థాయి నేత‌లు తెలంగాణకు రాబోతున్నారు. నిజానికి ల‌క్ష్మ‌ణ్ యాత్ర‌ను ఒక కేంద్ర‌మంత్రి ప్రారంభించాల్సి ఉంది. కానీ, వేరే కార‌ణాల వ‌ల్ల సాధ్యం కాలేక‌పోయింద‌న్నారు! దాదాపు 15 నియోజ‌క వ‌ర్గాల్లో ల‌క్ష్మ‌ణ్ ప‌ర్య‌టించాక‌.. జాతీయ నేత‌ల రాక మొద‌లైంది.

శ‌నివారం దుబ్బాక‌లో జ‌రిగిన స‌భ‌కు జీవీఎల్ న‌ర్సింహారావు పాల్గొన్నారు. మంగ‌ళ‌వారం నాటి స‌భ‌కు హోంశాఖ స‌హాయ‌మంత్రి హ‌న్స‌రాజ్ గంగారాం వ‌స్తారు. ఆ మ‌ర్నాడు చిట్యాలలో జ‌ర‌గబోతున్న సభ‌కు వ్య‌వ‌సాయ శాఖ స‌హాయ‌మంత్రి పురుషోత్తం రూపాల రాబోతున్నారు. జులై 5న హ‌న్మ‌కొండ స‌భ‌కు రామ్ మాధ‌వ్ హాజ‌రు కాబోతున్నారు. ఆ మ‌ర్నాడు.. అంటే యాత్ర ముగింపు స‌భ‌కు కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ వ‌స్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఈ నెల 13న భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కూడా ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌కు వ‌స్తున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా ఆయ‌న ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆయన పార్టీ సంస్థాగ‌త బ‌లోపేతానికి సంబంధించి కీల‌క చ‌ర్చ‌లు చేప‌డ‌తార‌ని అంటున్నారు.

ఇలా త‌ర‌చూ జాతీయ నేత‌లు రాష్ట్రానికి వ‌స్తే పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని రాష్ట్ర నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్న ప‌రిస్థితి..! నిజానికి, త‌ర‌చూ నేత‌లు వ‌చ్చినంత మాత్రాన భాజ‌పా బ‌లోపేతానికి ఎలా ఉప‌క‌రిస్తుంది..? కాక‌పోతే, త‌రచూ పార్టీ శ్రేణుల్లో కొంత హ‌డావుడీ, వార్త‌ల్లో ఉంటారు. అంతేగానీ… కొత్త‌గా పార్టీని బ‌లోపేతం కావాలంటే ముందుగా కేడ‌ర్ తోపాటు, పార్టీలో కొంత‌మంది పేరున్న నేత‌లు చేరాల్సి అవ‌స‌ర‌ముంది. అయితే, అమిత్ షా రాక సంద‌ర్బంగా కొన్ని చేరిక‌లు ఉంటాయ‌ని గ‌తంలో చాలాసార్లు రాష్ట్ర నేత‌లు చెబుతూ వ‌చ్చారు. ప్ర‌ముఖ పార్టీల నుంచి వ‌చ్చి చేరేందుకు నేత‌లు సిద్ధంగా ఉన్నార‌నీ అన్నారు. క‌నీసం ఈసారైనా, అమిత్ షా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో చేరిక‌ల కార్య‌క్ర‌మం ఉంటే.. పార్టీ బ‌లోపేతానికి అది కొంత ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంటుంది. అంతేగానీ… త‌ర‌చూ నాయ‌కులు వ‌చ్చి ప్ర‌చారం చేసినంత మాత్రాన అనూహ్య మార్పులు ప్రాక్టిక‌ల్ గా సాధ్యం కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close