హ‌రీష్ శంక‌ర్ స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్న‌ ప‌వ‌న్‌

ప‌వ‌న్ – హ‌రీష్ శంక‌ర్‌.. ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌’..
ఈ కాంబోకీ, ఆ పేరుకీ వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే వీరిద్ద‌రి ‘గ‌బ్బ‌ర్ సింగ్’ బాక్సాఫీసుని షేక్ చేసేసింది. మ‌ళ్లీ ప‌వ‌న్‌ని అంత మాసీగా చూడ‌లేక‌పోయారు అభిమానులు. ‘భ‌వ‌దీయుడు…’తో ఆ లోటు తీరుతుంద‌నుకుంటే.. ఆ సినిమా ప్ర‌క‌టించారు కానీ, ఇప్ప‌టి వ‌ర‌కూ అత్తా ప‌త్తా లేదు.

భ‌వ‌దీయుడుని ప‌క్క‌న పెట్టి వ‌కీల్ సాబ్ పూర్తి చేశాడు ప‌వ‌న్‌.
భ‌వ‌దీయుడుని ప‌క్క‌న పెట్టి స‌ముద్ర‌ఖ‌నికి మాటిచ్చాడు ప‌వ‌న్‌.
భ‌వ‌దీయుడుని ప‌క్క‌న పెట్టి ఇప్పుడు సుజిత్‌ని లైన్‌లోకి తీసుకొచ్చాడు ప‌వ‌న్‌.

ఓర‌కంగా ఇది హ‌రీష్ శంక‌ర్ స‌హ‌నాన్ని ప‌వ‌న్ ప‌రీక్షించ‌డ‌మే. ప‌వ‌న్ అంటే హ‌రీష్‌కు చాలా ఇష్టం. గౌర‌వం. అందుకే ప‌వ‌న్ లేట్ చేస్తున్నా, స‌హ‌నంతో నిరీక్షిస్తున్నాడు. `కొన్ని సార్లు రావ‌డం లేట్ అవ్వొచ్చేమో గానీ…. రావ‌డం మాత్రం ప‌క్కా` అని అభిమానుల‌కు ధైర్యం, న‌మ్మ‌కం నూరిపోస్తున్నాడు హ‌రీష్‌. ఎంత ధైర్య‌వ‌చ‌నాలు చెప్పుకొన్నా, ప‌వ‌న్ అంటే ఎంత అభిమానం ఉన్నా – ప‌వ‌న్ ఇలా ఏళ్ల‌కు ఏళ్లు నిరీక్ష‌ణ‌లో ప‌డేయ‌డం ముమ్మాటికీ ప‌వ‌న్ త‌ప్పే. నిజానికి.. ప‌వ‌న్ – హ‌రీష్ కాంబోకి ఉన్న క్రేజ్.. ప‌వ‌న్ – స‌ముద్ర‌ఖ‌ని, ప‌వ‌న్ – సుజిత్ కాంబోల‌కు లేదు. పైగా… హ‌రీష్ ది ఒర్జిన‌ల్ క‌థ. మిగిలిన‌వి రీమేకులు. అలాంట‌ప్పుడు ప‌వ‌న్ హరీష్ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డమే న్యాయం. ప‌వ‌న్ నుంచి మ‌రో రీమేక్ చూడ్డానికి అభిమానులు సిద్ధంగా ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ల‌కు కిక్ ఇచ్చేది మాత్రం ప‌వ‌న్ ని ఒర్జిన‌ల్ స్టోరీలో చూడ‌డ‌మే. హ‌రీష్ చెప్పిన క‌థ న‌చ్చ‌లేదా, అందులో మార్పులు చేర్పులూ ఉన్నాయా అంటే అదీ లేదు. డైలాగుల‌తో స‌హా ప‌వ‌న్‌కి స్క్రిప్టు వినిపించి ఓకే చేయించుకొన్నాడు హ‌రీష్‌. అలాంట‌ప్పుడు ఈ వెయిటింగ్ ఎందుకో…. ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌ని విష‌యం. సుజిత్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేస్తే.. ప‌వ‌న్ విష‌యంలో హ‌రీష్ త‌న‌కు తాను త‌ప్పుకోవ‌డం ఖాయంగా అనిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close