రవి కిరణ్‌ అరెస్టు- సోషల్‌ మీడియాపై మలివేట

శాసనమండలిని కించపర్చే పోస్టులు పెట్టినందుకు గాను గతంలో నిర్బంధంలోకి తీసుకుని చాలాగంటల పాటు ప్రశ్నించి పంపిన రవి కిరణ్‌ను ఇప్పుడు ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల కేసులోపోలీసులు అరెస్టు చేశారు. . ఇప్పటికే ఒకసారి చర్యకు గురైన వ్యక్తిని మరోసారి అంతకంటే తీవ్రమైన సెక్షన్ల కింద అరెస్టు చేయడమంటే సోషల్‌ మీడియాను బెదరగొట్టడానికేనని విమర్శలు వస్తున్నాయి. ఎంఎల్‌ఎ అనిత ఫిర్యాదుకు కారణమైన పోస్టు తీవ్రతను బట్టి మొదట హెచ్చరించి క్షమాపణలు కూడా చెప్పించవచ్చు. రవి కిరణ్‌ గతంలోనే పోలీసుల చర్యకు గురైన నేపథ్యం కూడా వుంది. . అభాగ్యబాదితులను వివక్షా పీడితులను ఆదుకోవడానికి ఉద్దేశించిన ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం రాజకీయ ఆయుధంగా వాడటం వల్ల సుప్రీం కోర్టు గతంలోనే వ్యాఖ్యానాలు చేసిన ఉదాహరణలున్నాయి. శాసనమండలిపై రవి కిరణ్‌ కార్టూన్‌ బాగాలేని మాట నిజమే గాని దాన్ని సభను కించపర్చడమంటూ మరింత పెద్ద ట్విస్టు ఇచ్చారు. గత సారి సభా గౌరవం అన్న పేరిట ఇప్పుడు దళిత నేత పేరిట ప్రభుత్వం పోలీసులసు వ్యూహాత్మకంగానే అడుగేస్తున్నట్టు కనిపిస్తుంది. . రవి కిరణ్‌ వైసీపీకీ అనుకూలమనడంలో సందేహం లేదు. అయితే టిడిపీకి బిజెపికి ఇతరులకు కూడా అలాటివి వున్నాయి. సోషల్‌ మీడియా ఒకరి అదుపులోనే వుండదు గనక దాన్ని లొంగదీసుకోవాలనుకోవాలనే ఆలోచనే ఆచరణ సాధ్యం కానిది. పైగా ఇలాటి చర్యల వల్ల అది మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అప్పుడు లబోదిబో తప్ప ఎవరైనా చేయగలిగింది వుండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.