పూజా హెగ్డేకు అన్ని కోట్లు ఎక్క‌డివి?

పూజా హెగ్డేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. పూజా ముంబైలో ఓ ఖ‌రీదైన బంగ్లా కొనుగోలు చేసింద‌ట‌. అదీ వార్త‌. సినిమా సెల‌బ్రెటీలు ఇళ్లూ, ఫ్లాటులూ, కార్లూ కొనేయ‌డం పెద్ద వింతేం కాదు. కాక‌పోతే.. ఆ బంగ్లా ఖ‌రీదు ఏకంగా రూ.45 కోట్ల‌ని టాక్. ఇంత విలాస‌వంత‌మైన బంగ్లాని ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ ద‌క్షిణాది న‌టి సొంతం చేసుకోలేద‌ట‌. అందుకే పూజా కొన్న ఆ ఇంటి గురించి బాలీవుడ్ మీడియా క‌థ‌లు క‌థ‌లుగా రాస్తోంది. ఈమ‌ధ్య ఫామ్ కోల్పోయి, అవ‌కాశాలు త‌గ్గిపోయిన పూజా ఇన్ని కోట్లు పెట్టి ఎలా కొంది? అన్ని డ‌బ్బులు ఎలా వ‌చ్చాయ‌ని చెవులు కొరుక్కొంటున్నారు. ముంబైలో ఇల్లు కొనేసిందంటే ఇక‌, అక్క‌డ సెటిలైపోవొచ్చ‌ని, సౌత్ సినిమాల‌పై ఫోక‌స్ త‌గ్గించే ఛాన్స్ ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి పూజాకి హైద‌రాబాద్ లో కూడా ఓ ఫ్లాట్ ఉంది. తెలుగులో సినిమాలు చేస్తున్న కొత్త‌లోనే ఇక్క‌డో విలాస‌వంత‌మైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. హైద‌రాబాద్ ఎప్పుడు వ‌చ్చినా అక్కడే మ‌కాం.

పూజా మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు సినిమాకు రూ.3 కోట్ల వ‌ర‌కూ డిమాండ్ చేసేది. ఒక్కోసారి ఆమె చేతిలో మూడు, నాలుగు సినిమాలుండేవి. క‌మ‌ర్షియ‌ల్ యాడ్లు కూడా బాగానే చేసింది. కాబ‌ట్టి… పూజా లాంటి స్టార్, రూ.45 కోట్లు పెట్టి విలాస‌వంత‌మైన ఇంటిని కొన‌డం పెద్ద వింతేం కాదు. కాక‌పోతే.. ఇప్పుడు పూజా చేతిలో పెద్ద‌గా సినిమాల్లేవు. అయినా స‌రే, త‌న సంపాద‌నంతా ఇంటిపై పెట్టేసిందంటే సాహ‌స‌మే అని చెప్పుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close